రుత్విక, సాయిప్రణీత్‌లకు టైటిల్స్
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు మెరిశారు. పురుషుల విభాగంలో పెట్రోలియంకు ఆడుతున్న సాయిప్రణీత్, మహిళల విభాగంలో ఖమ్మం అమ్మాయి రుత్వికా శివానీ టైటిల్స్ సాధించారు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో సాయిప్రణీత్ 21-19, 15-21, 22-20తో సమీర్‌వర్మ(ఏఐ)పై గెలవగా... మహిళల ఫైనల్లో రుత్విక 21-13, 21-13తో తెలంగాణకే చెందిన రీతుపర్ణాదాస్‌పై నెగ్గింది.
పురుషుల డబుల్స్ ఫైనల్లో మనూఅత్రి(ఏఏఐ), సుమీత్ రెడ్డి(ఏపీ) జోడీ 17-21, 21-13, 21-17 తో ప్రణయ్ చోప్రా(పెట్రోలియం), అక్షయ్ దివాల్కర్(ఏఐ) జోడీపై నెగ్గగా... మహిళల డబుల్స్‌లో ప్రద్య్నాగాద్రే, సిక్కిరెడ్డి(ఏఏఐ)జోడీ 21-12, 16-21, 21-18తో అపర్ణాబాలన్, ప్రజక్తాసావంత్(పెట్రోలియం) జోడీపై గెలిచి టైటిల్స్ సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో అరుణ్‌విష్ణు, అపర్ణాబాలన్(పెట్రోలియం) 21-16, 11-21, 21-15తో తరుణ్.కె(పెట్రోలియం), సిక్కిరెడ్డి(ఏఏఐ)ద్వయంపై నెగ్గి టైటిల్ గెలుచుకున్నారు.