saipranith
-
సెమీస్‌లో బెంగళూరు రాప్టర్స్
నేడు జరిగే తొలి సెమీఫైనల్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో చెన్నై సూపర్‌స్టార్స్ జట్టు; శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో పుణే సెవెన్ ఏసెస్‌తో బెంగళూరు రాప్టర్స్ జట్టు తలపడతాయి. ఆదివారం ఫైనల్ జరుగుతుంది సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 5–0తో అవధ్ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. గెలిచిన జట్టే ముందంజ వేసే ఈ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్, బ్రైస్ లెవెర్డెజ్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టారు. ‘ట్రంప్’ మ్యాచ్‌లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ నెగ్గడంతో రాప్టర్స్ రెండు ‘ట్రంప్’ మ్యాచ్‌ల్లోనూ గెలిచి సెమీస్ దారిని సులభతరం చేసుకుంది. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ వారియర్స్, చెన్నై సూపర్‌స్టార్స్, పుణే సెవెన్ ఏసెస్ సెమీస్ చేరాయి. పురుషుల డబుల్స్‌తో మొదలైన ఈ పోరులో అరుణ్ జార్జి–రియాన్ అగుంగ్ సపుట్రో (రాప్టర్స్) జోడీ 15–14, 7–15, 11–15తో సంగ్ హ్యూన్–షిన్ బెక్ చియోల్ (అవధ్) ద్వయం చేతిలో కంగుతింది. అయితే అవధ్ ‘ట్రంప్’ పోరులో జయరామ్ 9–15, 9–15తో లెవెర్డెజ్ (రాప్టర్స్) చేతిలో ఓడిపోవడంతో వచ్చిన పాయింట్ కూడా చేజారింది. మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్ (రాప్టర్స్) 15–12, 15–12తో బీవెన్ జాంగ్ (అవధ్)పై నెగ్గింది. అనంతరం రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోగా సాయిప్రణీత్ (రాప్టర్స్) 15–11, 15–13తో విన్సెంట్ (అవధ్)ను ఓడించి జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 4–0తో అవధ్‌పై గెలుపును ఖాయం చేసుకుంది. ఇక ఆఖరి మిక్స్డ్ డబుల్స్ పోరులో చన్ పెంగ్ సూన్– ఇయోమ్ హి వోన్ (రాప్టర్స్) జోడీ 7–15, 15–12, 15–11తో సంగ్ హ్యూన్–క్రిస్టీనా పెడర్సన్ (అవధ్) జంటపై గెలిచింది. -
‘బాయ్’పై ప్రణయ్, సాయిప్రణీత్ ధ్వజం
న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)కు తమ పేర్లను ప్రతిపాదించకపోవడంపై భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, భమిడిపాటి సాయిప్రణీత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధికార వర్గాలపై వారు విమర్శల దాడికి దిగారు. చైనా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ మంగళవారం నుంచి జరుగనుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. మలేసియా, ఇండోనేసియా నుంచి తమకంటే తక్కువ ర్యాంకు ఆటగాళ్లు టోర్నీ బరిలో దిగుతుండగా... ‘బాయ్’ ఉదాసీనత కారణంగా తా ను, సాయిప్రణీత్ అవకాశం కోల్పోయినట్లు ప్రణయ్ విమర్శించాడు. దీనిపై ‘బాయ్’ స్పందన మాత్రం వేరుగా ఉంది. బ్యాడ్మింటన్ ఆసియా (బీఏ) కోరిన మేరకు తాజా ర్యాంక్‌ల ప్రకారం పురుషుల, మహి ళల సింగిల్స్‌లో ఇద్దరేసి ఆటగాళ్లను ప్రతిపాదించా మని ‘బాయ్’ చెబుతోంది. మరోవైపు పలు టోర్నీలకు ఆటగాళ్ల ఎంట్రీలను పంపడంలో, వారి ప్రయా ణ వ్యవహారాలను పర్యవేక్షించడంలో ‘బాయ్’ తీరు ఘోరంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. -
రుత్విక, సాయిప్రణీత్‌లకు టైటిల్స్
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ విజయవాడ స్పోర్ట్స్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు మెరిశారు. పురుషుల విభాగంలో పెట్రోలియంకు ఆడుతున్న సాయిప్రణీత్, మహిళల విభాగంలో ఖమ్మం అమ్మాయి రుత్వికా శివానీ టైటిల్స్ సాధించారు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో సాయిప్రణీత్ 21-19, 15-21, 22-20తో సమీర్‌వర్మ(ఏఐ)పై గెలవగా... మహిళల ఫైనల్లో రుత్విక 21-13, 21-13తో తెలంగాణకే చెందిన రీతుపర్ణాదాస్పై నెగ్గింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో మనూఅత్రి(ఏఏఐ), సుమీత్ రెడ్డి(ఏపీ) జోడీ 17-21, 21-13, 21-17 తో ప్రణయ్ చోప్రా(పెట్రోలియం), అక్షయ్ దివాల్కర్(ఏఐ) జోడీపై నెగ్గగా... మహిళల డబుల్స్‌లో ప్రద్య్నాగాద్రే, సిక్కిరెడ్డి(ఏఏఐ)జోడీ 21-12, 16-21, 21-18తో అపర్ణాబాలన్, ప్రజక్తాసావంత్(పెట్రోలియం) జోడీపై గెలిచి టైటిల్స్ సాధించారు. మిక్స్డ్ డబుల్స్‌లో అరుణ్విష్ణు, అపర్ణాబాలన్(పెట్రోలియం) 21-16, 11-21, 21-15తో తరుణ్.కె(పెట్రోలియం), సిక్కిరెడ్డి(ఏఏఐ)ద్వయంపై నెగ్గి టైటిల్ గెలుచుకున్నారు. -
శ్రీకాంత్ సంచలనం
ప్రపంచ పదో ర్యాంకర్ నగుయాన్పై గెలుపు క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ సింగపూర్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార కిదాంబి శ్రీకాంత్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతను 18-21, 21-15, 21-8తో ప్రపంచ పదో ర్యాంకర్, ఏడోసీడ్ తియాన్ మిన్హ్ నగుయాన్ (వియత్నాం)పై విజయం సాధించాడు. తద్వారా క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 58 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏపీ కుర్రాడు పోరాట పటిమను ప్రదర్శించాడు. తొలి గేమ్‌లో 6-14తో వెనుకబడ్డా మెరుగైన ఆటతో 16-16తో స్కోరును సమం చేశాడు. అయితే స్కోరు 18-18 ఉన్న దశలో వియత్నాం ప్లేయర్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌ను సాధించాడు. రెండో గేమ్‌లో 8-5తో దూకుడు మీదున్న శ్రీకాంత్‌ను నగుయాన్ కాసేపు అడ్డుకున్నాడు. కానీ నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించిన శ్రీ వరుస పాయింట్లతో హోరెత్తించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం హైదరాబాద్ అబ్బాయి హవా కొనసాగింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 11-3, 16-6తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను ముగించాడు. ఇతర మ్యాచ్‌ల్లో భమిడిపాటి సాయిప్రణీత్ 24-22, 21-19తో జి లియాంగ్ డెరెక్ వాంగ్ (సింగపూర్)పై నెగ్గగా; హెచ్.ఎస్. ప్రణయ్ 17-21, 21-18, 12-21తో ఐదోసీడ్ పెంగ్యూ డూ (చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు. సత్తా చాటిన సింధు మహిళల సింగిల్స్‌లో ఏపీ అమ్మాయి ఎనిమిదోసీడ్ పి.వి.సింధు 21-17, 17-21, 21-16 ప్రపంచ 123వ ర్యాంకర్ షిజుకా ఉచెద(జపాన్)పై నెగ్గింది. ఈ మ్యాచ్ గంటా 3 నిమిషాల పాటు జరిగింది. ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో సింధు రెండో గేమ్‌ను చేజార్చుకుంది. అయితే కీలకమైన మూడో గేమ్ ఓ దశలో హైదరాబాదీ 15-11 ఆధిక్యాన్ని సంపాదించింది. కానీ జపాన్ అమ్మాయి ధాటిగా ఆడుతూ ఆధిక్యాన్ని 16-18కి తగ్గించింది. ఈ దశలో భిన్నమైన షాట్లతో అలరించిన సింధు మూడు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మరో మ్యాచ్‌లో పి.సి.తులసీ 19-21, 7-21తో రెండోసీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో ఆల్విన్ ఫ్రాన్సిస్-అరుణ్ విష్ణు 17-21, 22-24తో మహ్మద్ అసాన్-హెంద్రా సెతివాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడారు. దిగజారిన సింధు ర్యాంక్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సింధు 11వ ర్యాంక్‌కు పడిపోయింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో తొలి రౌండ్లోనే ఓడటం ఆమె ర్యాంక్‌పై ప్రభావం చూపింది. సైనా నెహ్వాల్ మాత్రం 8వ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 19వ ర్యాంక్‌లో నిలిచాడు. శ్రీకాంత్‌కు 25వ ర్యాంక్ లభించింది.