సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు పుల్లెల సాయివిష్ణు ముందంజ వేశాడు. ఏపీలోని తెనాలిలో ఆదివారం జరిగిన అండర్–15 బాలుర సింగిల్స్ రెండో రౌండ్‌లో సాయివిష్ణు (తెలంగాణ) 21–12, 21–16తో జోయ్ చటర్జీ (జార్ఖండ్)పై గెలుపొందాడు. బాలికల విభాగంలో టాప్ సీడ్ మేఘనా రెడ్డి (తెలంగాణ) 21–7, 21–18తో సుజెన్ బుర్హాగోహెన్ (అస్సాం)ను ఓడించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.
అండర్–13 బాలుర సింగిల్స్ మూడో రౌండ్లో నాలుగో సీడ్ లోకేశ్ రెడ్డి (తెలంగాణ) 21–12, 17–21, 24–22తో నీర్ నెహ్వాల్ (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో అభినయ్ సాయిరాం (తెలంగాణ) 21–12, 21–9తో లక్షిత్ శ్రీవాస్తవ (ఢిల్లీ)పై, సాత్విక్ రెడ్డి (తెలంగాణ) 22–20, 21–14తో సాత్విక్ అవస్థి (రాజస్థాన్)పై, అక్షత్ రెడ్డి (తెలంగాణ) 21–13, 21–11తో ధ్రువ్ నేగి (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు.
అండర్–15 బాలుర రెండో రౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు: హిమాన్షు (రాజస్థాన్) 21–5, 21–6తో జ్ఞాన హర్ష (తెలంగాణ)పై, అర్షద్ షేక్ (ఏపీ) 22–20, 21–19తో అయాన్ పాల్ (పశ్చిమ బెంగాల్)పై, అయాన్ రషీద్ (అస్సాం) 22–20, 21–13తో సాహస్ కుమార్ (తెలంగాణ)పై, ఉనీత్ కృష్ణ (తెలంగాణ) 21–12, 21–16తో జోయ్ చటర్జీ (జార్ఖండ్)పై, వరుణ్ (ఏపీ) 21–15, 21–13తో అయేశ్ గోస్వామి (జమ్ము, కశ్మీర్)పై, ప్రణవ్ రావు (తెలంగాణ) 21–9, 21–15లో అర్నమ్ జైన్‌పై గెలుపొందారు.
బాలికలు: అభిలాష (తెలంగాణ) 21–10, 21–7తో విలింద చాను (మణిపూర్)పై, భార్గవి (తెలంగాణ) 21–14, 21–17తో సుతాన్షి సర్కార్ (పశ్చిమ బెంగాల్)పై నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరారు.
Comments
Please login to add a commentAdd a comment