sai vishnu
-
సాయివిష్ణు జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు పుల్లెల సాయివిష్ణు సత్తా చాటాడు. చండీగఢ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి పీఎస్ రవికృష్ణ (కేరళ)తో కలిసి డబుల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. బుధవారం జరిగిన అండర్–19 బాలుర డబుల్స్ ఫైనల్లో సాయివిష్ణు (తెలంగాణ)–రవికృష్ణ (కేరళ) ద్వయం 18–21, 21–18, 21–16తో గిరీశ్ నాయుడు(ఎయిరిండియా)–శంకర్‌ప్రసాద్ ఉదయ్ కుమార్ (కేరళ) జోడీపై గెలుపొంది టైటిల్‌ను హస్తగతం చేసుకున్నారు. అంతకుముందు సెమీఫైనల్లో సాయివిష్ణు–రవికృష్ణ ద్వయం 21–17, 21–19తో ఆయుశ్ అగర్వాల్–తుషార్ (ఉత్తర్‌ప్రదేశ్)జంటపై, క్వార్టర్స్‌లో 19–21, 21–15, 21–13తో రెండోసీడ్ వెంకట హర్ష వర్ధన్ (ఆంధ్రప్రదేశ్)–అరవింద్ సురేశ్ (కేరళ) జోడీపై, రెండోరౌండ్లో 21–11, 21–16తో కౌశిక్ (తమిళనాడు)–శ్రీకర్ (తెలంగాణ) జంటపై, తొలిరౌండ్లో 21–19, 21–14తో ఆర్యన్ హుడా–పంకజ్ (హరియాణా) జంటపై గెలుపొందారు. బాలికల డబుల్స్ విభాగంలో రెండోసీడ్ అదితి భట్ (ఉత్తరాఖండ్)–తాన్య హేమంత్ (కర్ణాటక) జోడీ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఈ జంట 21–11, 21–9తో ఆరోసీడ్ శ్రుతి మిశ్రా–శైలజా శుక్లా (ఉత్తర్‌ప్రదేశ్) జోడీని ఓడించింది. ఈ కేటగిరీలో వైష్ణవి–కైవల్య లక్ష్మి (తెలంగాణ) జంట క్వార్టర్స్‌లో, కె. భార్గవి–సాయి శ్రీయ (తెలంగాణ) జోడీలు తొలిరౌండ్లో ఓటమి పాలయ్యాయి. మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌పోరులో టాప్ సీడ్ ఎడ్విన్ జాయ్ (కేరళ)–శ్రుతి మిశ్రా (ఉత్తర్‌ప్రదేశ్) జోడీ 21–18, 21–14తో నాలుగోసీడ్ అరవింద్ సురేశ్ (కేరళ)–శ్రీవిద్య గురజాడ (తెలంగాణ) జంటపై నెగ్గి విజేతగా నిలిచింది. బాలికల సింగిల్స్ విభాగంలో మూడోసీడ్ మాన్సిసింగ్ (ఉత్తర్‌ప్రదేశ్), బాలుర సింగిల్స్ కేటగిరీలో రెండోసీడ్ రవి (హరియాణా) చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకున్నారు. -
శభాష్... సాయి విష్ణు
సాక్షి, హైదరాబాద్: తొలుత క్రీడాకారుడిగా రాణించి... ఆ తర్వాత కోచ్‌గా మారి భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసిన పుల్లెల గోపీచంద్, పీవీవీ లక్ష్మి కుటుంబం నుంచి మరో స్టార్ తయారవుతున్నాడు. తల్లి లక్ష్మి అడుగుజాడల్లో పయనిస్తూ ఇప్పటికే ఆమె కుమార్తె పుల్లెల గాయత్రి జూనియర్ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంటుండగా... తండ్రి గోపీచంద్ స్ఫూర్తితో తనయుడు పుల్లెల సాయి విష్ణు తొలిసారి సింగిల్స్ విభాగంలో జాతీయస్థాయిలో అదరగొట్టాడు. బెంగళూరులో జరిగిన జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో 14 ఏళ్ల సాయి విష్ణు అండర్–15 బాలుర సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన తొమ్మిదో సీడ్ సాయి విష్ణు ఫైనల్లో 21–14, 21–19తో మూడో సీడ్ యాకల సాయిసత్య సర్వేశ్ (పుదుచ్చేరి)పై విజయం సాధించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సాయి విష్ణు రెండో రౌండ్లో 21–11, 21–8తో దివ్యాంశ్ (హిమాచల్‌ప్రదేశ్)పై, మూడో రౌండ్లో 21–12, 21–12తో తేజస్ (మహారాష్ట్ర)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–16, 20–22, 21–14తో నాలుగో సీడ్ ప్రణవ్ శర్మ (ఉత్తరాఖండ్)పై, క్వార్టర్ ఫైనల్లో 21–19, 21–18తో ఎనిమిదో సీడ్ అంకిత్ (బెంగాల్)పై, సెమీ ఫైనల్లో 21–13, 21–17తో టాప్ సీడ్ శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు)పై గెలుపొందాడు. ఇదే టోర్నమెంట్ అండర్–17 బాలుర డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ గిరీశ్ నాయుడు తన భాగస్వామి శంకర్‌ప్రసాద్ ఉదయ్ కుమార్ (కేరళ)తో కలిసి టైటిల్ సాధించాడు. అండర్–17 బాలికల డబుల్స్ విభాగంలో ఎ.అభిలాష–కె.భార్గవి (తెలంగాణ) జంట రన్నరప్‌గా నిలిచింది. అతనిపై ఒత్తిడి పెంచం! సబ్ జూనియర్ నేషనల్స్‌లో విష్ణు విజేతగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. నాడు తొలిసారి జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలవడంతో గోపి విజయ ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పుడు సబ్ జూనియర్లోనే విష్ణు టోర్నీ గెలుచుకున్నాడు. గత కొంత కాలంగా డబుల్స్‌లో అతను నిలకడగా రాణిస్తూ టైటిల్స్ సాధించాడు. అయితే సింగిల్స్‌లో మాత్రం అతనికి చెప్పుకోదగ్గ విజయం లభించలేదు. ఇప్పుడు సింగిల్స్‌లో తొలిసారి టోర్నమెంట్‌ను గెలుచుకోవడం విష్ణు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు స్ఫూర్తినిస్తుంది. అండర్–15 విభాగంలో వయసు పరిమితి దాటిపోతుంది కాబట్టి వచ్చేసారి అతని లక్ష్యం అండర్–17లో సత్తా చాటడమే. అయితే మేం విష్ణుపై విజయాల కోసం ఎలాంటి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం లేదు. ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా పట్టించుకోకుండా అతను ఆటను ఆస్వాదిస్తే చాలు. – పీవీవీ లక్ష్మి, ఒలింపియన్ (విష్ణు తల్లి) -
మూడో రౌండ్లో సాయివిష్ణు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు పుల్లెల సాయివిష్ణు ముందంజ వేశాడు. ఏపీలోని తెనాలిలో ఆదివారం జరిగిన అండర్–15 బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో సాయివిష్ణు (తెలంగాణ) 21–12, 21–16తో జోయ్ చటర్జీ (జార్ఖండ్)పై గెలుపొందాడు. బాలికల విభాగంలో టాప్ సీడ్ మేఘనా రెడ్డి (తెలంగాణ) 21–7, 21–18తో సుజెన్ బుర్హాగోహెన్ (అస్సాం)ను ఓడించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. అండర్–13 బాలుర సింగిల్స్ మూడో రౌండ్లో నాలుగో సీడ్ లోకేశ్ రెడ్డి (తెలంగాణ) 21–12, 17–21, 24–22తో నీర్ నెహ్వాల్ (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో అభినయ్ సాయిరాం (తెలంగాణ) 21–12, 21–9తో లక్షిత్ శ్రీవాస్తవ (ఢిల్లీ)పై, సాత్విక్ రెడ్డి (తెలంగాణ) 22–20, 21–14తో సాత్విక్ అవస్థి (రాజస్థాన్)పై, అక్షత్ రెడ్డి (తెలంగాణ) 21–13, 21–11తో ధ్రువ్ నేగి (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు. అండర్–15 బాలుర రెండో రౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు: హిమాన్షు (రాజస్థాన్) 21–5, 21–6తో జ్ఞాన హర్ష (తెలంగాణ)పై, అర్షద్ షేక్ (ఏపీ) 22–20, 21–19తో అయాన్ పాల్ (పశ్చిమ బెంగాల్)పై, అయాన్ రషీద్ (అస్సాం) 22–20, 21–13తో సాహస్ కుమార్ (తెలంగాణ)పై, ఉనీత్ కృష్ణ (తెలంగాణ) 21–12, 21–16తో జోయ్ చటర్జీ (జార్ఖండ్)పై, వరుణ్ (ఏపీ) 21–15, 21–13తో అయేశ్ గోస్వామి (జమ్ము, కశ్మీర్)పై, ప్రణవ్ రావు (తెలంగాణ) 21–9, 21–15లో అర్నమ్ జైన్‌పై గెలుపొందారు. బాలికలు: అభిలాష (తెలంగాణ) 21–10, 21–7తో విలింద చాను (మణిపూర్)పై, భార్గవి (తెలంగాణ) 21–14, 21–17తో సుతాన్షి సర్కార్ (పశ్చిమ బెంగాల్)పై నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరారు. -
సాయివిష్ణు, భార్గవి శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు పుల్లెల సాయివిష్ణు, కె. భార్గవి శుభారంభం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో సోమవారం జరిగిన అండర్–15 బాలుర తొలిరౌండ్లో సాయివిష్ణు (తెలంగాణ) 21–19, 21–15తో సత„ŠS సింగ్ (ఢిల్లీ)పై, ప్రణవ్ రావు (తెలంగాణ) 21–11, 21–9తో భార్గవ్ రామిరెడ్డి (తెలంగాణ)పై గెలుపొందారు. బాలికల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ భార్గవి (తెలంగాణ) 21–18, 21–18తో అవంతిక పాండే (ఉత్తరాఖండ్)పై, ఎనిమిదో సీడ్ కైవల్య లక్ష్మి (తెలంగాణ) 21–14, 21–15తో విదుషి సింగ్‌పై, తొమ్మిదో సీడ్ మేఘనా రెడ్డి (తెలంగాణ) 21–14, 21–11తో రియా (కేరళ)పై, అభిలాష 21–9, 21–12తో ఐశ్వర్య మెహతా (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు. అండర్–13 బాలుర తొలిరౌండ్ ఫలితాలు: లోకేశ్ రెడ్డి (తెలంగాణ) 21–14, 21–11తో నాగ మణికంఠ (ఏపీ)పై, అక్షత్ రెడ్డి (తెలంగాణ) 21–18, 21–16తో సాత్విక్ రెడ్డి (ఏపీ)పై, ఆశ్రిత్ వలిశెట్టి (తెలంగాణ) 21–18, 21–23, 21–18తో నిధిశ్ భట్‌పై, రుషేంద్ర తిరుపతి (తెలంగాణ) 18–21, 21–16, 21–9తో ఎల్. లోకేశ్ (తెలంగాణ)పై, అభినయ్ సాయిరాం (తెలంగాణ) 21–19, 21–6తో పూజిత్ రెడ్డిపై గెలుపొందారు. బాలికలు: ప్రసన్న (తెలంగాణ) 21–9, 21–6తో ప్రియామృత (ఏపీ)పై, అమూల్య (తెలంగాణ) 21–17, 16–21, 21–18తో కర్నిక శ్రీ (కర్నాటక)పై, శ్రీనిత్య 21–10, 21–16తో ఆషిత (మధ్యప్రదేశ్)పై నెగ్గారు. -
ఫెయిల్ అవుతాననే ఆందోళనతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు సరిగ్గా రాయలేకపోయానని ఆందోళన చెందిన ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నంద్యాలలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల పట్టణ శివారులోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కిరాణం వ్యాపారి లక్ష్మీనారాయణ కుమారుడు జయచంద్ర సాయివిష్ణు స్థానిక శ్రీనివాసనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. 2013లో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో ఫెయిల్ అయిన మూడు సబ్జెక్టులు రాశాడు. అయితే మళ్లీ ఫెయిల్ అవుతానేమోనని మనస్థాపం చెందాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులంతా ఎవరి పనుల్లో వారు ఉండగా సాయివిష్ణు తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.