సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కేయూర జోడీ ఫైనల్‌కు చేరుకుంది. విజయవాడలోని డీఆర్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన అండర్-15 బాలికల డబుల్స్ సెమీఫైనల్లో కేయూర మోపాటి (తెలంగాణ)-కవిప్రియ (పంజాబ్) జోడీ 21-16, 21-9తో భార్గవి -కైవల్య లక్ష్మి (తెలంగాణ) జంటపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో భార్గవి -కైవల్య లక్ష్మి జోడీ 21-19, 21-16తో తన్య హేమంత్-కీర్తన (కర్ణాటక) జంటపై, కేయూర-కవిప్రియ జోడీ 21-18, 21-19తో అదితి-స్నేహ (ఉత్తరాఖండ్) జంటపై నెగ్గాయి.
మరోవైపు బాలికల సింగిల్స్‌లో కేయూర పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. కవిప్రియ (పంజాబ్)తో జరిగిన క్వార్టర్స్ పోరులో 17-21, 21-19, 21-11తో కేయూర (తెలంగాణ) ఓడిపోయింది.
అండర్-13 కేటగిరీలో ఆదివారం జరిగిన బాలుర క్వార్టర్స్‌లో ఉనీత్ కృష్ణ (తెలంగాణ) 21-19, 18-21, 21-15తో ప్రణవ్ శర్మ (ఉత్తరాఖండ్)పై, ప్రణవ్ రావు (తెలంగాణ) 21-13, 21-7తో తన్మయ్ బికాశ్ (అస్సాం)పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నారు. బాలికల విభాగంలో మేఘన (తెలంగాణ) 21-15, 21-18తో అవంతిక పాండే (ఉత్తరాఖండ్)పై నెగ్గింది. బాలుర డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రణవ్ రావు- సారుు విష్ణు పుల్లెల (తెలంగాణ) జంట 21-12, 21-9తో ధర్మాంగన మండపాటి (తెలంగాణ)- రుషేంద్ర (ఏపీ) జోడీపై, వంశీకృష్ణ (ఏపీ)- ఉనీత్ కృష్ణ (తెలంగాణ) జంట 21-10, 21-12తో శంకరన్-రిషి (పంజాబ్) జోడీపై గెలిచాయి. బాలికల డబుల్స్‌లో మేఘన (తెలంగాణ)-తస్నీమ్ మీర్ (గుజరాత్) జంట 21-11, 19-21, 21-14తో నిఖిత-అదితి (మహారాష్ట్ర) జోడీపై నెగ్గి సెమీస్‌కు చేరింది.