
సాక్షి, హైదరాబాద్: ‘రెడ్‌బుల్ షటిల్ అప్’ బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ టోర్నమెంట్‌లో అపర్ణ– మైత్రేయి జంట విజేతగా నిలిచింది. హైదరాబాద్ అంచెలో భాగంగా నిజాంపేటలోని జేఎస్‌కే బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం జరిగిన ఫైనల్లో అపర్ణ–మైత్రేయి జంట 11–1, 11–3తో హారిక రాథోడ్–హరిత దిలీప్ జోడీపై గెలుపొందింది.
మహిళల బ్యాడ్మింటన్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ టోర్నీని... హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, గువాహటి వేదికల్లో జరుపుతున్నారు. ఫైనల్ రౌండ్‌ను ముంబైలో నిర్వహిస్తారు. ఇందులో విజేతగా నిలిచిన జోడీకి... భారత డబుల్స్ ప్లేయర్ అశ్విని పొన్నప్ప జంటతో తలపడే అవకాశం లభిస్తుంది.