ప్రణవ్‌రావు ‘డబుల్’
రంగారెడ్డి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గోపీచంద్ అకాడమీకి చెందిన ప్రణవ్‌రావ్, సాయివిష్ణు అండర్–15 విభాగంలో చెరో రెండు టైటిల్స్ సాధించారు. సరూర్‌నగర్ స్టేడియంలో గురువారం ముగిసిన ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ప్రణవ్ విజేతగా నిలువగా సాయి విష్ణు రన్నరప్‌గా నిలిచాడు. డబుల్స్‌లో ప్రణవ్– సాయి విష్ణు జోడి.. విఘ్నేశ్– సుహాస్ ద్వయంపై గెలిచి టైటిల్ సాధించింది. మరోవైపు లోహిత్, ధనిక్ చెరో మూడు పతకాలు కైవసం చేసుకున్నారు. లోహిత్ (గోపీచంద్ అకాడమీ) అండర్– 19 బాలురు, పురుషుల విభాగంలో విజేతగా.. అండర్–19 డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అండర్–19 సింగిల్స్‌లో ధనిక్ రన్నరప్‌గా.. డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. విజేతలకు ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యకమ్రంలో సరూర్ నగర్ కార్పొరేటర్ అనితా దయాకర్, అడిషనల్ ఎస్పీలు అమరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇతర పోటీల ఫలితాలు:
అండర్: 13 బాలురు: 1. రవి ఉత్తేజ్ 2. భవ్యంత్ సాయి; డబుల్స్: 1. రవి ఉత్తేజ్– సుశాంత్ రెడ్డి 2. రోహన్ కుమార్– మిహిర్ శాస్త్రి; బాలికలు: 1. సంజన 2. అమూల్య జైస్వాల్; డబుల్స్: 1. సంజన– శిఖ 2. అమూల్య జైస్వాల్– కీర్తన.
అండర్–15 బాలురు సింగిల్స్: 1. ప్రణవ్ రావు (గోపీచంద్ అకాడమీ) 2. సాయి విష్ణు (గోపీచంద్ అకాడమీ); డబుల్స్: 1. ప్రణవ్ రావు– సాయి విష్ణు, 2. విఘ్నేశ్– సుహాస్; బాలికలు సింగిల్స్: 1. నిథిల, 2. సంజన (గోపీచంద్ అకాడమీ); డబుల్స్: 1. శిక్ష– భార్గవి (వీబీఏ) 2. శ్రేయ (గోపీచంద్ అకాడమీ)– పూజిత(గోపీచంద్ అకాడమీ).
అండర్–17 బాలురు సింగిల్స్: 1. ప్రణవ్ రావు 2. సూర్యకిరణ్ రెడ్డి; డబుల్స్: 1. శశాంక్– ఆదిత్య 2. వంశీ కృష్ణ– వెంకట్ నిహిత్ రావు; బాలికలు సింగిల్స్: 1. భార్గవి 2. పూజిత; డబుల్స్: 1. మైత్రేయి– అపర్ణ 2. నిధి– మేఘన.
పురుషుల డబుల్స్: 1. సందీప్ (సీఆర్పీఎఫ్) – రాహుల్ (సీఆర్పీఎఫ్) 2. గోపాలకృష్ణా రెడ్డి– ఆదిత్య; మహిళల సింగిల్స్: 1. వైష్ణవి 2. వంశిక; డబుల్స్: 1. వైష్ణవి– మమత 2. వంశిక– సుప్రియ.
పురుషులు 35+ సింగిల్స్: 1. సూర్యారావు 2. కార్తీక్; డబుల్స్: 1. వేణుగోపాలరావు– కార్తీక్ 2. వెంకట్ రెడ్డి– సోమేశ్వరరావు.
పురుషులు 40+ సింగిల్స్: 1. ప్రభాకర్ రెడ్డి 2. ఆనంద్; డబుల్స్: 1. ఆనంద్– భార్గవ్ 2. కోటి– రవి ప్రకాశ్.
పురుషులు 45+ సింగిల్స్: 1.రాజేశ్ 2. నరేందర్ రెడ్డి; డబుల్స్: 1. నరేందర్ రెడ్డి– ప్రవీణ్ గౌడ్ 2. రాజేశ్– వర్గీస్ .
పురుషులు 50+ సింగిల్స్: 1. సుబ్రహ్మణ్యం 2. రవి గోవింద్; డబుల్స్: 1. సుబ్రహ్మణ్యం– రవి గోవింద్ 2. జయంత్– నాగేశ్వరరావు.
పురుషులు 55+ సింగిల్స్: 1. సురేందర్ రెడ్డి 2. శంకర్ రావు, డబుల్స్: 1. బలరామిరెడ్డి– పీఎస్ రెడ్డి 2. శంకర్ రావు– సురేందర్ రెడ్డి.
పురుషులు 60+ సింగిల్స్: 1. భిష రెడ్డి 2. నాగేశ్వర రావు.