Pranav Rao
-
మెయిన్ ‘డ్రా’కు ప్రణవ్ రావు అర్హత
థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు గంధం ప్రణవ్ రావు మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ప్రణవ్ రావు 15–21, 21–14, 21–17తో చాంగ్ షి చియె (చైనీస్ తైపీ)పై గెలుపొంది ముందంజ వేశాడు. భారత్‌కే చెందిన హేమంత్ గౌడ, రవి కూడా మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టారు. -
భారత జట్టులో ముగ్గురు తెలంగాణ షట్లర్లు
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బృందాన్ని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. బాలురు, బాలికల విభాగాల్లో కలిపి మొత్తం 23 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో ముగ్గురు తెలంగాణ షట్లర్లకు చోటు దక్కింది. బాలుర విభాగంలో ప్రణవ్ రావు గంధం, నవనీత్ బొక్కా, ఖదీర్ మొయినుద్దీన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్నారు. బాలికల విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ ఎంపిక కాలేదు. ఆగస్టులో పంచకుల, బెంగళూరులలో జరిగిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో ప్రదర్శన, సాధించిన పాయింట్ల ఆధారంగా భారత జట్టును ఎంపిక చేశారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 13 వరకు రష్యాలోని కజాన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. -
విజేత ప్రణవ్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ గంధం ప్రణవ్ రావు విజేతగా నిలిచాడు. గువాహటిలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో ప్రణవ్ రావు అండర్–17 బాలుర సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ప్రణవ్ 21–14, 21–19తో అయూశ్ రాజ్ గుప్తా (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించాడు. లోకేశ్ రెడ్డి డబుల్ ధమాకా.... అండర్–15 బాలుర విభాగంలో తెలంగాణకే చెందిన లోకేశ్ రెడ్డి డబుల్ ధమాకా సృష్టించాడు. అతను సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలో టైటిల్స్ సాధించాడు. డబుల్స్ ఫైనల్లో లోకేశ్ రెడ్డి–అంకిత్ మండల్ (పశ్చిమ బెంగాల్) ద్వయం 21–12, 21–12తో టాప్ సీడ్ గగన్–మయాంక్ రాణా (హరియాణా) జోడీపై నెగ్గగా... సింగిల్స్ ఫైనల్లో లోకేశ్ 25–23, 18–21, 21–14తో రాఘవ్ (హరియాణా)పై గెలిచాడు. -
చాంపియన్ ప్రణవ్
పుణే: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ కుర్రాడు గంధం ప్రణవ్ రావు పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ ఈవెంట్ అండర్–17 బాలుర సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ ప్రణవ్ 15–21, 21–18, 21–11తో రెండో సీడ్ రవి (హరియాణా)పై విజయం సాధించాడు. మేఘనకు మూడు పతకాలు రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో తెలంగాణ అమ్మాయి గుండ్లపల్లి మేఘన రెడ్డి స్వర్ణం సహా రెండు రజతాలు కలిపి మొత్తం మూడు పతకాలను సొంతం చేసుకుంది. ‘హూప్’ ఈవెంట్లో మేఘన 11.05 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని దక్కించుకోగా... ‘బాల్’ ఈవెంట్లో ఆమె 12.35 పాయింట్లు... ‘రిబ్బన్’ ఈవెంట్లో 10.50 పాయింట్లు సాధించి ఆమె రజత పతకాలను కైవసం చేసుకుంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 76 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చుక్కా శ్రీలక్ష్మి 139 కేజీలు బరువెత్తి కాంస్య పతకాన్ని సాధించింది. -
ప్రణవ్‌రావు ‘డబుల్’
రంగారెడ్డి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గోపీచంద్ అకాడమీకి చెందిన ప్రణవ్రావ్, సాయివిష్ణు అండర్–15 విభాగంలో చెరో రెండు టైటిల్స్ సాధించారు. సరూర్‌నగర్ స్టేడియంలో గురువారం ముగిసిన ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ప్రణవ్ విజేతగా నిలువగా సాయి విష్ణు రన్నరప్‌గా నిలిచాడు. డబుల్స్‌లో ప్రణవ్– సాయి విష్ణు జోడి.. విఘ్నేశ్– సుహాస్ ద్వయంపై గెలిచి టైటిల్ సాధించింది. మరోవైపు లోహిత్, ధనిక్ చెరో మూడు పతకాలు కైవసం చేసుకున్నారు. లోహిత్ (గోపీచంద్ అకాడమీ) అండర్– 19 బాలురు, పురుషుల విభాగంలో విజేతగా.. అండర్–19 డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అండర్–19 సింగిల్స్‌లో ధనిక్ రన్నరప్‌గా.. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. విజేతలకు ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యకమ్రంలో సరూర్ నగర్ కార్పొరేటర్ అనితా దయాకర్, అడిషనల్ ఎస్పీలు అమరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇతర పోటీల ఫలితాలు: అండర్: 13 బాలురు: 1. రవి ఉత్తేజ్ 2. భవ్యంత్ సాయి; డబుల్స్: 1. రవి ఉత్తేజ్– సుశాంత్ రెడ్డి 2. రోహన్ కుమార్– మిహిర్ శాస్త్రి; బాలికలు: 1. సంజన 2. అమూల్య జైస్వాల్; డబుల్స్: 1. సంజన– శిఖ 2. అమూల్య జైస్వాల్– కీర్తన. అండర్–15 బాలురు సింగిల్స్: 1. ప్రణవ్ రావు (గోపీచంద్ అకాడమీ) 2. సాయి విష్ణు (గోపీచంద్ అకాడమీ); డబుల్స్: 1. ప్రణవ్ రావు– సాయి విష్ణు, 2. విఘ్నేశ్– సుహాస్; బాలికలు సింగిల్స్: 1. నిథిల, 2. సంజన (గోపీచంద్ అకాడమీ); డబుల్స్: 1. శిక్ష– భార్గవి (వీబీఏ) 2. శ్రేయ (గోపీచంద్ అకాడమీ)– పూజిత(గోపీచంద్ అకాడమీ). అండర్–17 బాలురు సింగిల్స్: 1. ప్రణవ్ రావు 2. సూర్యకిరణ్ రెడ్డి; డబుల్స్: 1. శశాంక్– ఆదిత్య 2. వంశీ కృష్ణ– వెంకట్ నిహిత్ రావు; బాలికలు సింగిల్స్: 1. భార్గవి 2. పూజిత; డబుల్స్: 1. మైత్రేయి– అపర్ణ 2. నిధి– మేఘన. పురుషుల డబుల్స్: 1. సందీప్ (సీఆర్పీఎఫ్) – రాహుల్ (సీఆర్పీఎఫ్) 2. గోపాలకృష్ణా రెడ్డి– ఆదిత్య; మహిళల సింగిల్స్: 1. వైష్ణవి 2. వంశిక; డబుల్స్: 1. వైష్ణవి– మమత 2. వంశిక– సుప్రియ. పురుషులు 35+ సింగిల్స్: 1. సూర్యారావు 2. కార్తీక్; డబుల్స్: 1. వేణుగోపాలరావు– కార్తీక్ 2. వెంకట్ రెడ్డి– సోమేశ్వరరావు. పురుషులు 40+ సింగిల్స్: 1. ప్రభాకర్ రెడ్డి 2. ఆనంద్; డబుల్స్: 1. ఆనంద్– భార్గవ్ 2. కోటి– రవి ప్రకాశ్. పురుషులు 45+ సింగిల్స్: 1.రాజేశ్ 2. నరేందర్ రెడ్డి; డబుల్స్: 1. నరేందర్ రెడ్డి– ప్రవీణ్ గౌడ్ 2. రాజేశ్– వర్గీస్ . పురుషులు 50+ సింగిల్స్: 1. సుబ్రహ్మణ్యం 2. రవి గోవింద్; డబుల్స్: 1. సుబ్రహ్మణ్యం– రవి గోవింద్ 2. జయంత్– నాగేశ్వరరావు. పురుషులు 55+ సింగిల్స్: 1. సురేందర్ రెడ్డి 2. శంకర్ రావు, డబుల్స్: 1. బలరామిరెడ్డి– పీఎస్ రెడ్డి 2. శంకర్ రావు– సురేందర్ రెడ్డి. పురుషులు 60+ సింగిల్స్: 1. భిష రెడ్డి 2. నాగేశ్వర రావు. -
మైక్రోసాఫ్ట్ గుర్తించిన అతిచిన్న టెక్నాలజీ స్పెషలిస్ట్...
తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే ప్రణవ్ కళ్యాణ్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ టెక్నాలజీ (ఎం.సి.టి.ఎస్.) నిర్వహించిన ఎ.ఎస్.పి.నెట్. ఫ్రేమ్‌వర్క్ 3.5 ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణుడై అతిపిన్న ప్రోగ్రామర్‌గా గుర్తింపు పొందాడు. దీనిని ప్రపంచంలోనే అత్యంత కష్టమైన కంప్యూటర్ పరీక్షగా భావిస్తారు. ఇప్పటికే పిన్న వయసులో కంప్యూటర్ సైన్స్‌లో అసాధారణ ప్రతిభను కనబర్చిన వ్యక్తుల వికీపీడియా జాబితాలో ప్రణవ్ స్థానం పొందాడు. ప్రణవ్ రెండు సంవత్సరాల వయసులోనే బొమ్మలతో కాకుండా కంప్యూటర్‌పై ఆసక్తి చూపేవాడు. లాస్‌ఏంజిలెస్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేసే ఈ చిన్నది తండ్రి కళ్యాణ్‌కుమార్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పైన ప్రణవ్‌కు ఉన్న ఆసక్తి చూసి ఎం.సి.టి.ఎస్. పరీక్షకు సిద్ధం చేశారు. ఆరేళ్ల ప్రాయం నుంచి ప్రణవ్ హెచ్టిఎమ్ఎల్ ప్రోగ్రామ్ని నేర్చుకోవడం ప్రారంభించి, రానురాను కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఆసక్తి పెంచుకున్నాడు. ప్రణవ్ లెక్కల్లో చాలా చురుగ్గా ఉంటాడని, 18 నెలల పాటు ఎం.సి.టి.ఎస్. పరీక్షకు సిద్ధమయ్యాడని అతని తండ్రి తెలిపారు. శని, ఆదివారాల్లో ఎనిమిది గంటల పాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌కు సమయం కేటాయించేవాడని ఆయన అన్నారు. ‘భవిష్యత్తులో ఏం అవుతావు’ అని అడిగితే... ‘కంప్యూటర్ ప్రోగ్రామర్గానే కాకుండా అంతరిక్ష వ్యోమగామి కూడా కావాలనుకుంటున్నాను’ అని ప్రణవ్ బదులిచ్చాడు.