
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించాయి. కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 2–3తో ఇండోనేసియా చేతిలో... భారత మహిళల జట్టు 1–4తో జపాన్ చేతిలో ఓడిపోయాయి. ఇండోనేసియాతో పోటీలో భారత యువస్టార్స్ లక్ష్య సేన్, మిథున్ మంజునాథ్ రెండు సింగిల్స్‌లో గెలిచారు.
చదవండి: Ind Vs Wi 3rd T20: మూడో టీ20కి స్టార్ ప్లేయర్లు దూరం... మరో కీలక సిరీస్‌కు కూడా డౌటే.. ఎందుకంటే!