ఏపీ సబ్ జూనియర్ అండర్-13 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హెదరాబాద్‌కు చెందిన సాయి శ్రేయ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.
అనంతపురం స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ఏపీ సబ్ జూనియర్ అండర్-13 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హెదరాబాద్‌కు చెందిన సాయి శ్రేయ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఇక్కడి డీపీఓ ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన టోర్నీ మొదటి రౌండ్‌లో శ్రేయ 21-8, 21-14తో లహరి (చిత్తూరు)పై విజయం సాధించింది. మరోవైపు శ్వేత (హైదరాబాద్) 15-21, 19-21తో కేయూర (రంగారెడ్డి) చేతిలో ఓటమిపాలైంది. రంగారెడ్డి క్రీడాకారిణులు భార్గవి, అభిలాష కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. తొలి రౌండ్‌లో భార్గవి 21-8, 21-9తో హర్షిత వర్మ (మెదక్)పై, అభిలాష 21-7, 21-6తో స్ఫూర్తి (నెల్లూరు)పై గెలుపొందారు. బాలుర విభాగం మొదటి రౌండ్‌లో హైదరాబాద్ క్రీడాకారులు స్వరూప్, కీర్తి శశాంక్, మనీశ్ కుమార్ పరాజయం పాలయ్యారు.
స్వరూప్ 11-21, 27-25, 17-21తో సాయి చరణ్ (గుంటూరు) చేతిలో, కీర్తి శశాంక్ 15-21, 23-25తో వర్షాంత్ (మెదక్) చేతిలో, మనీష్ కుమార్ 13-21, 10-21తో ప్రసాద్ (కరీంనగర్) చేతిలో పరాజయం పొందారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేశ్ కుమార్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ టోర్నీలో వివిధ జిల్లాలకు చెందిన 250 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తల్లి సుబ్బారావమ్మను జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జొన్నా సత్యనారాయణ సన్మానించారు.