భవధీర్, విష్ణు ముందంజ | Bhavadhir, Vishnu lead | Sakshi
Sakshi News home page

భవధీర్, విష్ణు ముందంజ

Published Thu, Jul 31 2014 11:50 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Bhavadhir, Vishnu lead

 ఏపీ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్
 సాక్షి, హైదరాబాద్: ఏపీ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాళ్లు భవధీర్, విష్ణువర్ధన్ గౌడ్ ముందంజ వేశారు. వరంగల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అండర్-15 బాలుర సింగిల్స్‌లో భవధీర్ 21-18, 21-7తో సాయి హేమంత్ (అనంతపురం)పై, విష్ణు 21-6, 21-11తో ఉదయ్ కిరణ్ (నల్లగొండ)పై అలవోక విజయాలు సాధించారు.
 
 అనురాగ్ (రంగారెడ్డి) 16-21, 16-21తో చంద్రజ్ పట్నాయక్ (వైజాగ్) చేతిలో, సుధీశ్ వెంకట్ (రంగారెడ్డి) 19-21, 15-21తో నాగ సాయి దినేశ్ (కర్నూల్) చేతిలో పరాజయం చవిచూశారు. అనిల్ (వరంగల్) 21-15, 21-14తో ధనిక్ (రంగారెడ్డి)పై, రితిన్ (వరంగల్) 21-14, 21-12తో మనోజ్ (రంగారెడ్డి)పై గెలుపొందారు. బాలికల సింగిల్స్‌లో కావ్య రెడ్డి (హైదరాబాద్) 21-6, 21-9తో బ్రహ్మణి (నల్లగొండ)పై, వైష్ణవి రెడ్డి (రంగారెడ్డి) 21-14, 21-2తో వైష్ణవి (గంటూరు)పై, యశస్విని (వరంగల్) 21-2, 21-2తో ప్రియాంక (ఆదిలాబాద్)పై విజయం సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement