జాతీయ బ్యాడ్మింటన్ విజేత పీఎస్‌పీబీ | PSPB retain team title for 15th straight year | Sakshi
Sakshi News home page

జాతీయ బ్యాడ్మింటన్ విజేత పీఎస్‌పీబీ

Published Fri, Dec 20 2013 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

మహిళల విభాగంలో విజేతగా నిలిచిన పీఎస్‌పీబీ జట్టు

మహిళల విభాగంలో విజేతగా నిలిచిన పీఎస్‌పీబీ జట్టు

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) హవా కొనసాగింది. ఇక్కడ జరుగుతున్న జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో టీమ్ టైటిల్‌ను పీఎస్‌పీబీ మళ్లీ గెలుచుకుంది. పెట్రోలియం జట్టు జాతీయ విజేతగా నిలవడం ఇది వరుసగా 15వ సారి కావడం విశేషం.
 
 గురువారం జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో పీఎస్‌పీబీ జట్టు 3-1 తేడాతో ఎయిరిండియాపై విజయం సాధించింది. సౌరభ్‌వర్మ, శ్రీకాంత్, గురుసాయిదత్ సింగిల్స్‌లో గెలిచి జట్టుకు టైటిల్ అందించారు. మహిళల విభాగంలో పీఎస్‌పీబీ జట్టు 2-0తో ఎయిరిండియాను చిత్తు చేసింది. సింగిల్స్‌లో పీవీ సింధు, డబుల్స్‌లో అశ్విని-జ్వాల జోడీ విజయాలు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement