వరల్డ్ పారా బ్యాడ్మింటన్ టోర్నీకి రామాంజనేయులు | world para badminton tournment ramanjaneyulu | Sakshi
Sakshi News home page

వరల్డ్ పారా బ్యాడ్మింటన్ టోర్నీకి రామాంజనేయులు

Published Wed, Oct 16 2013 11:45 PM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

world para badminton tournment ramanjaneyulu

ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో జరిగే వరల్డ్ పారా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెం దిన రామాంజనేయులు ఎం పికయ్యాడు.
 
 బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫర్ చాలెంజ్‌డ్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. అతను సింగిల్స్, డబుల్స్ ఈవెంట్‌లలో తలపడుతాడు. గత ఏడాది జరిగిన జాతీయ సీనియర్ చాలెంజ్‌డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రామాంజనేయులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా భారత జట్టులో చోటు దక్కింది. ఈ పోటీలు నవంబరు 4 నుంచి 10 దాకా జర్మనీలోని డార్ట్‌మండ్‌లో జరుగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement