
సాక్షి,నాగ్‌పూర్: పురుషుల జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకు కిడాంబి శ్రీకాంత్‌పై హెచ్‌ఎస్ ప్రణయ్ విజయం సాధించి టైటిల్ అందుకున్నాడు. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ 21-15, 16-21, 21-7 లతేడాతో విజయం సాధించాడు.
తొలి సెట్‌లో పైచేయి సాధించిన ప్రణయ్.. రెండో సెట్‌లో తడబడ్డాడు. ఇక మూడో సెట్‌లో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పై చేయి సాధించాడు. సెమీఫైనల్స్‌లో ప్రణయ్ 21–14, 21–17తో క్వాలిఫయర్ శుభాంకర్ డే (రైల్వేస్)పై గెలుపొందారు. 2013లో శ్రీకాంత్ జాతీయ చాంపియన్‌గా నిలువగా... ప్రణయ్ తొలిసారి ఈ టైటిల్‌ను సాధించాడు.