సాక్షి, హైదరాబాద్: పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగనున్న జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 9 నుంచి ఐదో ఎడిషన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టోర్నమెంట్ వివరాలతో పాటు ట్యుటోరియల్ ప్రోగ్రామ్ ‘జేబీసీ బూట్ క్యాంప్’ను టోర్నీ బ్రాండ్ అంబాసిడర్, భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు, కోచ్ యు. విమల్ కుమార్ ఆవిష్కరించారు.
ఈనెల 9 నుంచి సెప్టెంబర్ 10 వరకు దేశంలోని 10 నగరాల్లో అండర్–9, 11, 13, 15, 17 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీ జరుగుతుంది. తొలి దశ (జూలై 9–12) పోటీలకు చండీగఢ్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం ముంబైలో జూలై 21నుంచి 25వరకు, పుణేలో జూలై 27నుంచి 31వరకు, కొచ్చిలో ఆగస్టు 2నుంచి 5వరకు, బెంగళూరులో ఆగస్టు 7నుంచి 11వరకు, గువాహటిలో ఆగస్టు 10నుంచి 13 వరకు, హైదరాబాద్‌లో 16నుంచి 20వరకు, అహ్మదాబాద్‌లో ఆగస్టు 19నుంచి 22వరకు, లక్నోలో ఆగస్టు 30నుంచి సెప్టెంబర్ 1వరకు, ఢిల్లీలో సెప్టెంబర్ 3నుంచి 7వరకు పోటీలు జరుగుతాయి. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment