
సైనా నెహ్వాల్, సాయిప్రణీత్
బ్యాంకాక్: ప్రపంచ ర్యాంకర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులేని భారత బ్యాడ్మింటన్ జట్లు థామస్–ఉబెర్ కప్ టీమ్ చాంపియన్‌షిప్ పోరాటానికి సిద్ధమయ్యాయి. టోర్నీ తొలి రోజు ఆదివారం ఫ్రాన్స్‌తో భారత పురుషుల జట్టు... కెనడాతో భారత మహిళల జట్టు తలపడతాయి. పురుషుల విభాగంలో తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ థామస్ కప్‌లో జట్టును నడిపించనున్నాడు. అతనికి సాయిప్రణీత్, సమీర్ వర్మ, లక్ష్య సేన్ సింగిల్స్‌లో అందుబాటులో ఉన్నారు. డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డిలతో పాటు అర్జున్–శ్లోక్ రామచంద్రన్‌లకు అంతర్జాతీయ అనుభవముంది. దీంతో థామస్ కప్‌లో భారత్ పతకంపై ఆశలు పెట్టుకోవచ్చు. కానీ మహిళల జట్టు పరిస్థితే దయనీయంగా ఉంది. ఇక్కడ పతకం కోసం కాదు... మ్యాచ్ మ్యాచ్‌లో విజయం కోసం శక్తికి మించి శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో ర్యాంకర్ సింధుతో పాటు, కామన్వెల్త్ గేమ్స్ కాంస్యపతక విజేత జోడి అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డిలు కూడా గైర్హాజరీ అవుతున్నారు. దీంతో సైనా బృందంలో అనుభవంలేని 16 ఏళ్ల జక్కారెడ్డి వైష్ణవి, శ్రీకృష్ణప్రియ, అనుర, వైష్ణవి భాలేలు సింగిల్స్‌లో ప్రత్యర్థులని ఏమాత్రం ఎదుర్కొంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment