Sai Prashanth
-
శక్తికి మించి శ్రమించాల్సిందే
బ్యాంకాక్: ప్రపంచ ర్యాంకర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులేని భారత బ్యాడ్మింటన్ జట్లు థామస్–ఉబెర్ కప్ టీమ్ చాంపియన్‌షిప్ పోరాటానికి సిద్ధమయ్యాయి. టోర్నీ తొలి రోజు ఆదివారం ఫ్రాన్స్‌తో భారత పురుషుల జట్టు... కెనడాతో భారత మహిళల జట్టు తలపడతాయి. పురుషుల విభాగంలో తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ థామస్ కప్‌లో జట్టును నడిపించనున్నాడు. అతనికి సాయిప్రణీత్, సమీర్ వర్మ, లక్ష్య సేన్ సింగిల్స్‌లో అందుబాటులో ఉన్నారు. డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డిలతో పాటు అర్జున్–శ్లోక్ రామచంద్రన్‌లకు అంతర్జాతీయ అనుభవముంది. దీంతో థామస్ కప్‌లో భారత్ పతకంపై ఆశలు పెట్టుకోవచ్చు. కానీ మహిళల జట్టు పరిస్థితే దయనీయంగా ఉంది. ఇక్కడ పతకం కోసం కాదు... మ్యాచ్ మ్యాచ్‌లో విజయం కోసం శక్తికి మించి శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో ర్యాంకర్ సింధుతో పాటు, కామన్వెల్త్ గేమ్స్ కాంస్యపతక విజేత జోడి అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డిలు కూడా గైర్హాజరీ అవుతున్నారు. దీంతో సైనా బృందంలో అనుభవంలేని 16 ఏళ్ల జక్కారెడ్డి వైష్ణవి, శ్రీకృష్ణప్రియ, అనుర, వైష్ణవి భాలేలు సింగిల్స్‌లో ప్రత్యర్థులని ఏమాత్రం ఎదుర్కొంటారో చూడాలి. -
సాయిప్రణీత్‌కు షాక్
నాగ్‌పూర్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్, మూడో సీడ్ సాయిప్రణీత్‌కు చుక్కెదురైంది. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ హైదరాబాద్ ప్లేయర్ సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 21–13, 18–21, 20–22తో క్వాలిఫయర్ శుభాంకర్ డే (రైల్వేస్) చేతిలో ఓడిపోయాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకాంత్ (పీఎస్‌పీబీ) 21–17, 23–21తో శుభమ్ ప్రజాపతి (మధ్యప్రదేశ్)పై, ప్రణయ్ (పీఎస్‌పీబీ) 22–20, 21–19తో కశ్యప్ (పీఎస్‌పీబీ)పై గెలుపొందారు. సెమీస్‌లో సింధు, సైనా: మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్), రుత్విక శివాని (పీఎస్‌పీబీ), సైనా (పీఎస్‌పీబీ), అనురా (ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–11, 21 – 17తో శ్రేయాన్షి (మధ్యప్రదేశ్)పై, రుత్విక 21–14, 21–8తో సాయి ఉత్తేజిత రావు (ఏఏఐ)పై, అనురా 21–19, 21–9తో శైలి రాణే (రైల్వేస్)పై, సైనా 21 – 17, 21–10తో ఆకర్షి కశ్యప్ (ఏఏఐ)పై గెలిచారు. -
నటుడు ఆత్మహత్య
చెన్నై : రాష్ట్రంలోని ప్రముఖ నాయకురాలు లలితాసుభాష్ కుమారుడు, ప్రముఖ నటుడు సాయిప్రశాంత్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. వెండితెర, బుల్లితెర నటుడిగా ప్రాచుర్యం పొందిన అతడు ఆదివారం రాత్రి చెన్నై వలసరవాక్కమ్ గంగానగర్‌లోని తన ఇంటిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐందాంపడై, ముందినంపార్తేన్, ఎదో చెయ్దాయ్ ఎన్నై, నేరం, తెగిడి తదితర చిత్రాల్లోనే కాకుండా వీటిక్కు వీడు లూటీ,సెల్వీ, అరసి, ఇదయం, ముహూర్తం తదితర పలు టీవీ సీరియళ్లలోనూ ఆయన నటించారు. సాయి ప్రశాంత్ మృతిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతడి మిత్రుల సాయంతో ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. సాయిప్రశాంత్ ఇంట్లో విగత జీవిగా పడి ఉన్నాడు. అతడి మృతదేహం పక్కనే మద్యం బాటిల్ ఉంది. మద్యంలో విషం కలుపుకుని తాగి అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే సాయిప్రశాంత్ మిత్రులు మాత్రం అతను ఆత్మహత్యకు పాల్పడేంత పిరికి వాడు కాదని చెబుతున్నారు. అతడి మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సాయిప్రశాంత్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు కీల్పాక్కమ్ ఆస్పత్రికి తరలించారు. సాయిప్రశాంత్ మృతదేహం పక్కనే ఉన్న అతడు రాసిన లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో సాయిప్రశాంత్ తన మరణానికి తానే కారణమని స్పష్టం చేశారు. అంతేకాని తన భార్య సుజిత గానీ మరెవ్వరూ బాధ్యులు కాదనీ ఆలేఖలో సాయిప్రశాంత్ పేర్కొన్నాడు. కాగా సాయిప్రశాంత్ గతంలో నిరంజన అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారు విడాకులు తీసుకున్నారు. అ తర్వాత సుజిత అనే యువతిని సాయిప్రశాంత్ రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఆమె ఆదివారం కోవైలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఇంటికి రావాలంటూ సాయిప్రశాంత్ మూడు నాలు సార్లు భార్య సుజితకు ఫోన్ చేశాడు. వెంటనే ఇంటికి తిరిగి వచ్చేందుకు ఆమె రావడానికి నిరాకరించినట్లు సమాచారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలూ తనను విడిచి వెళ్లి పోవడంతో మనశ్శాంతి కోల్పోయిన సాయిప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సాయిప్రశాంత్ అనూహ్య మరణం ఇటు చిత్ర పరిశ్రమలోనూ, అటు బుల్లితెర పరిశ్రమలోనూ పెద్ద కలకలానికి దారి తీసింది. అతని బంధువర్గం, మిత్రబృందంలో విషాదఛాయల్ని నింపింది. -
విషం తాగి టీవీ నటుడి ఆత్మహత్య
చెన్నై: పాపులర్ తమిళ టీవీ నటుడు సాయి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలోని తన నివాసంలో సాయి ప్రశాంత్ డ్రింక్‌లో విషం కలుపుకొని తాగినట్టు పోలీసులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం కిల్పాక్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని, ఒంటరితనం కారణం కావచ్చని భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సాయి ప్రశాంత్ మూడునెలల క్రితం మరో పెళ్లి చేసుకున్నాడు. వీడియో జాకీగా కెరీర్‌గా ప్రారంభించిన సాయి ప్రశాంత్ అన్నామలై, సెల్వీ, అరసి వంటి టీవీ సీరియళ్లలో నటించాడు. కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించాడు.