Uber Cup badmintion championship
-
Uber Cup 2022: సింధు సహా భారత షట్లర్లకు భంగపాటు
బ్యాంకాక్: ఉబెర్ కప్ 2022లో భారత మహిళా షట్లర్లకు ఘోర పరాభవం ఎదురైంది. బుధవారం జరిగిన గ్రూప్ డి చివరి క్లాష్‌లో పీవీ సింధుతో పాటు భారత షట్లర్లంతా మూకుమ్మడిగా చేతులెత్తేశారు. కొరియా టీమ్ చేతిలో సింధు నేతృత్వంలోని భారత జట్టు 0-5 తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో భారత డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, ప్రపంచ నంబర్ 7 పీవీ సింధు.. యాన్ సే యంగ్ చేతిలో 15-21, 14-21తేడాతో ఓటమిపాలవ్వగా, రెండో మ్యాచ్‌లో డబుల్స్ జోడీ శ్రుతి మిశ్రా, సిమ్రన్ సింఘి 13-21, 12-21 తేడాతో లీ సోహీ-షిన్ సెంగ్ చాన్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. మూడో మ్యాచ్‌లో తకాషి కశ్యప్ (కిమ్ గా యున్ చేతిలో 10-21, 10-21 తేడాతో), నాలుగో మ్యాచ్‌లో తనీషా క్రాస్టో, ట్రీసా జోలీ జోడీ (14-21, 11-21 తేడాతో కిమ్ హే జియాంగ్-కాంగ్ హీ యోంగ్ చేతిలో), ఆఖరి మ్యాచ్‌లో అష్మితా చలిహా ( సిమ్ యుజిన్ చేతిలో 18-21, 17-21తేడాతో) వరుసగా ఓటమిపాలయ్యారు. గ్రూప్ డి తొలి రెండు క్లాషెష్‌లో కెనడా, యూఎస్ఏ షట్లర్లను మట్టికరిపించిన భారత మహిళా జట్టు నామమాత్రమైన చివరి పోరులో కొరియా జట్టు చేతిలో దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ టోర్నీలో తొలి రెండు క్లాషెష్‌లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు ఇదివరకే క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకుంది. రేపు (మే 12) జరుగబోరే క్వార్టర్ ఫైనల్లో (నాకౌట్) సింధు టీమ్.. థాయ్‌లాండ్ జట్టుతో తలపడనుంది. మరోవైపు థామస్ కప్‌లో భారత పురుషుల టీమ్ కూడా ఇదివరకే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. చదవండి: సత్తా చాటిన సింధు.. ఉబెర్ కప్ క్వార్టర్స్‌లో భారత్ -
సత్తా చాటిన సింధు.. ఉబెర్ కప్ క్వార్టర్స్‌లో భారత్
బ్యాంకాక్: ఉబెర్ కప్ 2022లో భారత మహిళా షట్లర్ల హవా కొనసాగుతుంది. గ్రూప్-డి లో భాగంగా కెనడాతో జరిగిన తొలి సమరంలో 4-1 తేడాతో విజయం సాధించిన భారత మహిళా జట్టు.. ఇవాళ (మే 10) యూఎస్ఏను 4-1తేడాతో మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌కు (నాకౌట్) అర్హత సాధించింది. యూఎస్ఏ టీమ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ నెం.7 ర్యాంకర్ పీవీ సింధు 21-10, 21-11 తేడాతో జెన్ని గాయ్ను ఓడించగా, రెండో మ్యాచ్‌లో భారత ద్వయం తనీషా క్రాస్టో, త్రీసా జాలీ 21-19, 21-10 తేడాతో ఫ్రాంసెస్కాకార్బెట్-అల్లీసన్ లీ జోడీపై విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఆకాశి కశ్యప్ 21-18, 21-11 తేడాతో ఎస్తేర్ షిని ఖంగుతినిపించగా.. నాలుగో మ్యాచ్‌లో సిమ్రన్ సింఘి-రితికా థాకర్ జోడీ లారెన్ లామ్-కోడి తాంగ్ లీ చేతిలో 12-21, 21-17, 21-13 తేడాతో ఓటమిపాలైంది. చివరి మ్యాచ్‌లో అష్మితా చాలిహ 21-18, 21-13 తేడాతో నటాలి చిని ఓడించి భారత ఆధిక్యాన్ని 4-1కి చేర్చింది. భారత మహిళా జట్టు తమ తదుపరి గ్రూప్ మ్యాచ్‌లో బుధవారం కొరియాతో తలపడనుంది. కాగా, థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు కూడా ఇదివరకే నాకౌట్ దశకు చేరుకుంది. చదవండి: నాకౌట్ దశకు భారత్ అర్హత -
భారత జట్లకు చుక్కెదురు
స్టార్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గైర్హాజరీ భారత బ్యాడ్మింటన్ జట్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రతిష్టాత్మక థామస్–ఉబెర్ కప్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత పురుషుల, మహిళల జట్లకు అనూహ్య ఓటమి ఎదురైంది. తొలి లీగ్ మ్యాచ్‌లోనే ఓటమితో భారత జట్లకు నాకౌట్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. బ్యాంకాక్: కోచ్‌ల వ్యూహాత్మక తప్పిదమో... ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేశారో గానీ భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు మూల్యం చెల్లించుకుంది. థామస్ కప్‌లో భాగంగా ఫ్రాన్స్ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–4తో ఓడిపోయింది. సింగిల్స్‌లో అగ్రశ్రేణి షట్లర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌ను... డబుల్స్‌లో మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంటను ఆడించకుండా విశ్రాంతి ఇవ్వడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–7, 21–18తో బ్రైస్ లెవెర్డెజ్ను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించాడు. అయితే రెండో మ్యాచ్‌లో అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జంట 13–21, 16–21తో బాస్టియన్ కెర్సాడీ–జూలియన్ మాయో జోడీ చేతిలో ఓడిపోయింది. స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో 21వ ర్యాంకర్ సమీర్ వర్మ 18–21, 22–20, 18–21తో ప్రపంచ 43వ ర్యాంకర్ లుకాస్ కోర్వీ చేతిలో ఓటమి చవిచూశాడు. దాంతో ఫ్రాన్స్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా జంట 10–21, 12–21తో థోమ్ గికెల్–రోనన్ లాబెర్ ద్వయం చేతిలో ఓడిపోవడంతో ఫ్రాన్స్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామ మాత్రమైన ఐదో మ్యాచ్‌లో జూనియర్ మాజీ వరల్డ్ నంబర్‌వన్ లక్ష్య సేన్ 20–22, 21–19, 19–21తో తోమా పపోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. ఇదే గ్రూప్‌లో చైనా కూడా ఉంది. నాలుగు జట్లున్న ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. సైనాకు షాక్... ఉబెర్ కప్‌లో భాగంగా కెనడాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు 1–4తో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ 21–15, 16–21, 16–21తో ప్రపంచ 14వ ర్యాంకర్ మిచెల్లి లీ చేతిలో పరాజయం పాలైంది. గతంలో మిచెల్లితో ఆడిన రెండుసార్లూ నెగ్గిన సైనాకు ఈసారి నిరాశ ఎదురైంది. రెండో మ్యాచ్‌లో రాచెల్ హోండెరిచ్ 21–11, 21–13తో జక్కా వైష్ణవి రెడ్డిని ఓడించి కెనడాకు 2–0తో ఆధిక్యం అందించింది. మూడో మ్యాచ్‌లో మేఘన–పూర్వీషా ద్వయం 21–19, 21–15తో మిచెల్లి టాంగ్–జోసెఫిన్ వు జంటను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో బ్రిట్నీ టామ్ 21–11, 21–15తో శ్రీకృష్ణప్రియపై నెగ్గడంతో కెనడా 3–1 తో విజయాన్ని దక్కించుకుంది. చివరి మ్యాచ్‌లో రాచెల్–క్రిస్టెన్ సాయ్ ద్వయం 21–14, 21–16తో సంయోగిత–ప్రాజక్తా జంటను ఓడించి కెనడాకు 4–1తో విజయాన్ని అందించింది. -
శక్తికి మించి శ్రమించాల్సిందే
బ్యాంకాక్: ప్రపంచ ర్యాంకర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులేని భారత బ్యాడ్మింటన్ జట్లు థామస్–ఉబెర్ కప్ టీమ్ చాంపియన్‌షిప్ పోరాటానికి సిద్ధమయ్యాయి. టోర్నీ తొలి రోజు ఆదివారం ఫ్రాన్స్‌తో భారత పురుషుల జట్టు... కెనడాతో భారత మహిళల జట్టు తలపడతాయి. పురుషుల విభాగంలో తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ థామస్ కప్‌లో జట్టును నడిపించనున్నాడు. అతనికి సాయిప్రణీత్, సమీర్ వర్మ, లక్ష్య సేన్ సింగిల్స్‌లో అందుబాటులో ఉన్నారు. డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డిలతో పాటు అర్జున్–శ్లోక్ రామచంద్రన్‌లకు అంతర్జాతీయ అనుభవముంది. దీంతో థామస్ కప్‌లో భారత్ పతకంపై ఆశలు పెట్టుకోవచ్చు. కానీ మహిళల జట్టు పరిస్థితే దయనీయంగా ఉంది. ఇక్కడ పతకం కోసం కాదు... మ్యాచ్ మ్యాచ్‌లో విజయం కోసం శక్తికి మించి శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో ర్యాంకర్ సింధుతో పాటు, కామన్వెల్త్ గేమ్స్ కాంస్యపతక విజేత జోడి అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డిలు కూడా గైర్హాజరీ అవుతున్నారు. దీంతో సైనా బృందంలో అనుభవంలేని 16 ఏళ్ల జక్కారెడ్డి వైష్ణవి, శ్రీకృష్ణప్రియ, అనుర, వైష్ణవి భాలేలు సింగిల్స్‌లో ప్రత్యర్థులని ఏమాత్రం ఎదుర్కొంటారో చూడాలి. -
భారత్ విజయానికి బాట వేస్తాం
జ్వాల-అశ్విని జోడి వ్యాఖ్య న్యూఢిల్లీ: ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రాణిస్తామని భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడి గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప తెలిపారు. ఈ టీమ్ ఈవెంట్లో భారత్ విజయానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. డబుల్స్‌లో తప్పక గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల విభాగంలో ఉబెర్ కప్, పురుషుల విభాగంలో థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలు ఈ నెల 18 నుంచి ఇక్కడి సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనున్నాయి. ‘డబుల్స్‌లో మాపై భారీ అంచనాలు ఉన్నాయి. మా శక్తి మేర రాణిస్తాం. భారత్ గెలిచేందుకు దోహదపడే విజయాన్ని అందిస్తాం. వ్యక్తిగత ఈవెంట్ కంటే టీమ్ ఈవెంట్ భిన్నమైంది. జట్టు కోసం ఆడుతున్నప్పుడు సమష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. భారత్ గెలవాలనే లక్ష్యంతో మేమంతా బరిలోకి దిగుతాం’ అని గుత్తాజ్వాల పేర్కొంది. ఈమెకు ఉబెర్‌కప్‌లో విశేషమైన అనుభవముంది. తన పదహారో యేటే 2000లో ఈ టోర్నీ బరిలోకి దిగింది. ఈమె భాగస్వామి అశ్విని మాట్లాడుతూ ‘వ్యక్తిగత టోర్నీలు దేశం తరఫునే ఆడతాం. కానీ అవి మా కోసం మేం ఆడతాం. అక్కడ పెద్దగా ఒత్తిళ్లు ఉండవు. కానీ టీమ్ ఈవెంట్లలో మాత్రం అలా కాదు. ఎవరికి వారు బాగా ఆడటం కాదు, అందరూ అన్ని విభాగాల్లో రాణించేందుకు కష్టపడాలి. అప్పుడే జట్టుకు ఫలితం వస్తుంది’ అని తెలిపింది.