సత్తా చాటిన సింధు.. ఉబెర్‌ కప్‌ క్వార్టర్స్​లో భారత్​ | Uber Cup Final: India Seal Quarterfinal Berth With Win Over USA | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన సింధు.. ఉబెర్‌ కప్‌ క్వార్టర్స్​లో భారత్​

Published Tue, May 10 2022 4:42 PM | Last Updated on Tue, May 10 2022 4:42 PM

Uber Cup Final: India Seal Quarterfinal Berth With Win Over USA - Sakshi

బ్యాంకాక్‌: ఉబెర్​ కప్​ 2022లో భారత మహిళా షట్లర్ల హవా కొనసాగుతుంది. గ్రూప్​-డి లో భాగంగా కెనడాతో జరిగిన తొలి సమరంలో 4-1 తేడాతో విజయం సాధించిన భారత మహిళా జట్టు.. ఇవాళ (మే 10) యూఎస్​ఏను​ 4-1తేడాతో మట్టికరిపించి క్వార్టర్​ ఫైనల్స్​కు (నాకౌట్‌) అర్హత సాధించింది. యూఎస్​ఏ టీమ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ నెం.7 ర్యాంకర్‌ పీవీ సింధు 21-10, 21-11 తేడాతో జెన్ని గాయ్​ను ఓడించగా, రెండో మ్యాచ్​లో భారత ద్వయం తనీషా క్రాస్టో, త్రీసా జాలీ 21-19, 21-10 తేడాతో ఫ్రాంసెస్కాకార్బెట్‌-అల్లీసన్​ లీ జోడీపై విజయం సాధించింది.

మూడో మ్యాచ్​లో ఆకాశి కశ్యప్‌ 21-18, 21-11 తేడాతో ఎస్తేర్​ షిని ఖంగుతినిపించగా.. నాలుగో మ్యాచ్‌లో సిమ్రన్‌ సింఘి-రితికా థాకర్‌ జోడీ లారెన్​ లామ్​-కోడి తాంగ్​ లీ చేతిలో 12-21, 21-17, 21-13 తేడాతో ఓటమిపాలైంది. చివరి మ్యాచ్​లో అష్మితా చాలిహ 21-18, 21-13 తేడాతో నటాలి చిని ఓడించి భారత ఆధిక్యాన్ని 4-1కి చేర్చింది. భారత మహిళా జట్టు తమ తదుపరి గ్రూప్‌ మ్యాచ్‌లో బుధవారం కొరియాతో తలపడనుంది. కాగా, థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టు కూడా ఇదివరకే నాకౌట్‌ దశకు చేరుకుంది. 
చదవండి: నాకౌట్‌ దశకు భారత్‌ అర్హత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement