
ప్యారిస్:
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్‌పై కిదాంబి శ్రీకాంత్ గెలుపొందాడు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ప్రణయ్‌ను 14-21, 21-19, 21-18 తేడాతో ఓడించాడు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్‌లో మూడో గేమ్‌లో శ్రీకాంత్‌ను విజయం వరించింది. తొలి గేమ్‌లో వెనకబడ్డ శ్రీకాంత్ రెండో గేమ్‌లో హోరాహోరీగా తలపడ్డాడు. అటు ప్రణయ్ సైతం చక్కగా ఆడినా చివరకు 21-19 తో రెండో గేమ్‌ను శ్రీకాంత్ గెలిచాడు. ఇక నువ్వా నేనా అన్నట్టు సాగిన మూడో గేమ్‌ను శ్రీకాంత్ 21-18తో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment