
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ హెచ్‌ఎస్ ప్రణయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో కేరళకు చెందిన ప్రణయ్ రెండు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరుకొని భారత నంబర్‌వన్‌గా నిలిచాడు.
లక్ష్య సేన్ 22వ ర్యాంక్‌లో, కిడాంబి శ్రీకాంత్ 23వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఒక స్థానం పురోగతి సాధించి 11వ ర్యాంక్‌లో నిలిచింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకోగా... పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం రెండు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్‌లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment