
హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–18, 21–19తో ప్రపంచ 9వ ర్యాంకర్ ఎన్జీకా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు.
అక్సెల్‌సన్‌కు షాక్
మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యెవ్ (సింగపూర్) 14–21, 21–9, 21–6తో రెండో సీడ్ అక్సెల్‌సన్‌ను ఓడించి రెండో రౌండ్‌కు చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment