
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ను భారత ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ఓటమితో ప్రారంభించాడు. బ్యాంకాక్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ ప్రణయ్ 11–21, 21–9, 17–21తో 14వ ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయాడు.
నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో చైనా ప్లేయర్, ప్రపంచ 17వ ర్యాంకర్ లూ గ్వాంగ్ జుతో ప్రణయ్ తలపడతాడు. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ప్రణయ్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి.
చదవండి: Rohit Sharma: సగం సగం ఫిట్‌నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా...