Badminton World Super series finals
-
తొలి మ్యాచ్‌లో ప్రణయ్ పరాజయం
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ను భారత ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ ఓటమితో ప్రారంభించాడు. బ్యాంకాక్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ ప్రణయ్ 11–21, 21–9, 17–21తో 14వ ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో చైనా ప్లేయర్, ప్రపంచ 17వ ర్యాంకర్ లూ గ్వాంగ్ జుతో ప్రణయ్ తలపడతాడు. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ప్రణయ్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. చదవండి: Rohit Sharma: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా... -
ప్రతిష్టాత్మక టోర్నీ: సింధుకు చుక్కెదురు
-
ప్రతిష్టాత్మక టోర్నీ: సింధుకు చుక్కెదురు
దుబాయ్: తొలిసారి బ్యాడ్మింటన్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఆడుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తడబడింది. ఇక్కడ నేటి రాత్రి జరిగిన సెమిఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన షట్లర్ సుంగ్ జీ హున్ చేతిలో 15-21, 21-18, 15-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. గ్రూపు-బీ నుంచి రెండు విజయాలతో సెమిఫైనల్స్ చేరుకున్న సింధుకు నిరాశే ఎదురైంది. ప్రపంచ రెండో ర్యాంకర్ మారిన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడుతో ఆడిన సింధు ఈ మ్యాచ్ లో మాత్రం ప్రత్యర్థి సుంగ్ జీని కట్టడి చేయలేకపోయింది. ప్రత్యర్ధికి తొలి గేమ్ కోల్పోయిన సింధు, రెండో గేమ్ లో మాత్రం హోరాహోరిగా పోరాడింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్ లో సుంగ్ జీ ఎలాంటి తప్పిదాలను చేయకుండా గేమ్ నెగ్గి మ్యాచ్ సొంతం చేసుకుని బ్యాడ్మింటన్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది.