ప్రతిష్టాత్మక టోర్నీ: సింధుకు చుక్కెదురు | Ji Hyun Sung beats sindhu in World Super seriessemifinals | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మక టోర్నీ: సింధుకు చుక్కెదురు

Published Sat, Dec 17 2016 9:34 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

ప్రతిష్టాత్మక టోర్నీ: సింధుకు చుక్కెదురు

ప్రతిష్టాత్మక టోర్నీ: సింధుకు చుక్కెదురు

దుబాయ్: తొలిసారి బ్యాడ్మింటన్‌ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఆడుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తడబడింది. ఇక్కడ నేటి రాత్రి జరిగిన సెమిఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన షట్లర్ సుంగ్‌ జీ హున్‌ చేతిలో 15-21, 21-18, 15-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. గ్రూపు-బీ నుంచి రెండు విజయాలతో సెమిఫైనల్స్ చేరుకున్న సింధుకు నిరాశే ఎదురైంది.

ప్రపంచ రెండో ర్యాంకర్‌ మారిన్‌తో  జరిగిన గత మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడుతో ఆడిన సింధు ఈ మ్యాచ్ లో మాత్రం ప్రత్యర్థి సుంగ్ జీని కట్టడి చేయలేకపోయింది. ప్రత్యర్ధికి తొలి గేమ్ కోల్పోయిన సింధు, రెండో గేమ్ లో మాత్రం హోరాహోరిగా పోరాడింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్ లో సుంగ్ జీ ఎలాంటి తప్పిదాలను చేయకుండా గేమ్ నెగ్గి మ్యాచ్ సొంతం చేసుకుని బ్యాడ్మింటన్‌ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement