
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్స్ లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు. మంగళవారం మొదలైన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ లక్ష్య సేన్ తొలి రౌండ్‌లో సంచలన విజయం సాధించాడు.
ప్రపంచ ఐదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 21–19తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో చౌ తియెన్ చెన్‌తో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన లక్ష్య సేన్ మూడో ప్రయత్నంలో మాత్రం పైచేయి సాధించాడు.
మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, భారత నంబర్‌వన్ హెచ్‌ఎస్ ప్రణయ్ 21–19, 22–20తో జు వె వాంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment