అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో స్మృతి 704 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు పడిపోయి 702 పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకుంది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రాజేశ్వరి గైక్వాడ్ తొమ్మిదో ర్యాంక్‌లో, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ఏడో ర్యాంక్‌లో ఉన్నారు.
17వ ర్యాంక్‌కు పడిపోయిన సింధు
ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రదర్శన ఆమె ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపిస్తోంది. గతవారం యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన పీవీ సింధు... మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు పడిపోయింది. గతవారం 12వ ర్యాంక్‌లో నిలిచిన సింధు తాజాగా 17వ ర్యాంక్‌కు చేరుకుంది.
గత పదేళ్లలో సింధు అత్యల్ప ర్యాంక్ ఇదే కావడం గమనార్హం. సింధు చివరిసారి 2013 జనవరిలో 17వ ర్యాంక్‌లో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 టోర్నీలు ఆడిన సింధు మాడ్రిడ్ మాస్టర్స్ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచింది. మలేసియా మాస్టర్స్ టోర్నీ, కెనడా ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. ప్రస్తుతం కొరియా ఓపెన్ టోరీ్నలో సింధు బరిలో ఉంది.
కొత్త కోచ్‌గా హఫీజ్ హషీమ్
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ప్రారంభం కావడంతో పీవీ సింధు కొత్త వ్యక్తిగత కోచ్‌ను నియమించుకుంది. 2003 ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, మలేసియా మాజీ ప్లేయర్ మొహమ్మద్ హఫీజ్ హషీమ్ తన వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరిస్తాడని మంగళవారం సింధు ట్విటర్ వేదికగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment