బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ షట్లర్ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. ఇండొనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్ జిఝి ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భాగంగా జపాన్‌కు చెందిన కజుమా కవానోతో తలపడ్డాడు. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుండగా.. ఝాంగ్ జిఝి ఒక్కసారిగా కుప్పకులిపోయాడు.
పక్కనే ఉన్న సిబ్బంది ఝాంగ్ జిఝిను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఝాంగ్ జిఝిను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఈ విషయం తెలిసి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
इंडोनेशिया में एक टूर्नामेंट के दौरान कोर्ट पर गिर जाने के बाद 17 वर्षीय चीनी बैडमिंटन खिलाड़ी झांग झिजी की हृदयाघात से मौत हो गई।#ZhangZhijie #CardiacArrest pic.twitter.com/UoEx2ypjGf
— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) July 2, 2024
Comments
Please login to add a commentAdd a comment