
న్యూఢిల్లీ: మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న భారత మహిళా స్టార్ షట్లర్ పీవీ సింధు వచ్చే నెలలో జరిగే ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌తో పునరాగమనం చేయనుంది. ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు మలేసియాలోని షా ఆలమ్‌లో జరిగే ఈ టోరీ్నలో పాల్గొనే భారత మహిళల, పురుషుల జట్లను మంగళవారం ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొన్నాక సింధు మోకాలి గాయంతో ఆటకు దూరమైంది.
ప్రస్తుతం బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో ఇండోనేసియా కోచ్ అగుస్ ద్వి సాంతోసో పర్యవేక్షణలో సింధు శిక్షణ తీసుకుంటోంది. భారత మహిళల జట్టు: సింధు, అన్‌మోల్, తన్వీ శర్మ, అష్మిత, ట్రెసా జాలీ, గాయత్రి గోపీచంద్, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ప్రియా దేవి, శ్రుతి మిశ్రా. భారత పురుషుల జట్టు: ప్రణయ్, లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, చిరాగ్ సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, అర్జున్, సూరజ్ గోలా, పృథ్వీ రాయ్.
Comments
Please login to add a commentAdd a comment