భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అరుదైన ఘనత సాధించింది. ఫోర్బ్స్ టాప్ 25 స్పోర్ట్స్‌వుమెన్ జాబితాలో పీవీ సింధు చోటు సంపాదించింది. మహిళల అథ్లెట్లలో అత్యధికంగా సంపాదిస్తున్న 25 క్రీడాకారిణిల జాబితాను ఫోర్బ్స్ శుక్రవారం రిలీజ్ చేసింది. ఆ జాబితాలో షట్లర్ పీవీ సింధు 12వ స్థానంలో ఉంది. జపాన్‌కు చెందిన టెన్నిస్ స్టార్ ప్లేయర్ నవోమీ ఒసాకా తొలి స్థానంలో ఉంది.
టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్, కామన్‌వెల్త్‌గేమ్స్ సింగ్సిల్‌లో గోల్డ్, డబుల్స్‌లో సిల్వర్ గెలిచిన సింధు.. ఈ ఏడాది ఏడు మిలియన్ల డాలర్లు అర్జించినట్లు తెలుస్తోంది. వరుసగా మూడోసారి ఒసాకా ఫోర్బ్స్ జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అయితే ఈ జాబితాలో ఎక్కువ శాతం మంది టెన్నిస్ ప్లేయర్లే ఉన్నారు. టాప్ 10 లిస్టులో ఒసాకాతో పాటు సెరీనా, ఎమ్మా రాడుకాన, ఇగా స్వియాటెక్, వీనస్, కోకో గౌఫ్, జెస్సికా పెగులాలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment