
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ దూసుకుపోతున్నాడు. వరుసగా రెండో గ్రూపు స్టేజి మ్యాచ్‌లో లక్ష్యసేన్ విజయం సాధించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియంకు చెందిన జూలియన్ కరాగీని వరుస గేమ్‌లలో ఈ భారత స్టార్ షట్లర్ ఓడించాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న లక్ష్య సేన్ గ్రూప్ ఎల్ మ్యాచ్‌లో 21-19 21-14 తేడాతో కరాగీపై గెలుపొందాడు.
తొలి సెట్‌లో ప్రత్యర్ధి నుంచి లక్ష్య సేన్‌కు పోటీ ఎదురైంది. ఆఖరిలో పుంజుకున్న లక్ష్య 21-19తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అనంతరం రెండో సెట్‌ను 21-14 తేడాతో అలోవకగా సేన్ కైవసం చేసుకున్నాడు. తన తర్వాత మ్యాచ్‌లో జోనాథన్ క్రిస్టీతో సేన్ తలపడనున్నాడు. కాగా లక్ష్యసేన్ గెలిచిన తొలి మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ప్రత్యర్ధి కెవిన్ గాయం కారణంగా తప్పుకోవడంతో మ్యాచ్‌ను డిలేట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment