
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. కాంస్యం కోసం ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్.. మలేషియాకు చెందిన జెడ్ జే లీ చేతిలో 21-13, 16-21, 11-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ అలవోకగా నెగ్గిన సేన్.. రెండు, మూడు గేమ్‌లలో చేతులెత్తేశాడు.
కాగా, ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్ మూడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. షూటింగ్‌లో మనూ భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం, మిక్సడ్ విభాగాల్లో కాంస్య పతకాలు (సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి) సాధించగా.. స్వప్నిల్ కుసాలే పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పోజిషన్స్‌లో కాంస్యం నెగ్గాడు.
Comments
Please login to add a commentAdd a comment