
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లి బాజాకు మూహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల(డిసెంబర్)22వ తేదీన పీవీ సింధుకు హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయితో వివాహం జరుగనుంది.

హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి

వరుడు వెంకట దత్తసాయి ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు

ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. వధూవరుల కుటుంబాలకు ఇదివరకే పరిచయముంది

తాజా పరిణయంతో ఇరు కుటుంబాలు బంధువులు కానున్నారు. పెళ్లి వార్తను సింధు తండ్రి పీవీ రమణ ధ్రువీకరించారు.

‘ఇరు కుటుంబాలు కలసి నెల క్రితమే పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేశాం. వచ్చే జనవరి నుంచి సింధుకు బిజీ షెడ్యూల్ ఉండటంతో అందుబాటులో ఉన్న ఈ నెలలోనే వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాం

పెళ్లి వేడుకను ఉదయ్‌పూర్‌లో నిర్వహిస్తాం. ఈనెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తాం.




















