పీవీ సింధుని సన్మానించిన సింగపూర్ తెలుగు సమాజం | Singapore Telugu Society Congratulates Pv Sindhu Over Singapore Badminton | Sakshi
Sakshi News home page

Pv Sindhu: పీవీ సింధుని సన్మానించిన సింగపూర్ తెలుగు సమాజం

Published Sun, Jul 17 2022 9:03 PM | Last Updated on Sun, Jul 17 2022 9:07 PM

Singapore Telugu Society Congratulates Pv Sindhu Over Singapore Badminton - Sakshi

సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్-2022లో అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పి.వి.సింధును సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది.  వరుస విజయాలతో దూసుకుపోతూ తన ఆటతో కెరియర్లోనే ఫస్ట్ సూపర్ 500 టైటిల్తో పాటు ఈ ఏడాది మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం.

ఈ సందర్భంగా అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. సింధు భారతదేశంతో పాటు తెలుగువారందరిని గర్వపడేలా చేసిందని, భవిష్యత్లో మరిన్ని ఉన్నత కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రానున్న కామన్ వెల్త్, వరల్డ్ ఛాంపియన్షిప్ గేమ్స్‌లో కూడా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సింధూ మాట్లాడుతూ.. తనను వ్యక్తిగతంగా కలిసి శుభాభినందనలు తెలిపిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు సమాజం నిర్వహించే కార్యక్రమాలను తెలుసుకొని, సింగపూర్లో నివశించే తెలుగు వారికి సమాజం చేస్తున్న సేవలను కొనియాడారు.

సింగపూర్ తెలుగు సమాజం జూలై 31న నిర్వహించనున్న బ్యాట్మింటన్ టోర్నమెంట్లో పాల్గొననున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సమాజం ఆగష్టు 13న సింగపూర్లో నివసించే తెలుగు వనితలకు మాత్రమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న నారీ (లేడీస్ నైట్) కార్యక్రమాన్ని స్త్రీలు వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement