
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత స్టార్ పీవీ సింధు 14–21, 18–21తో హి బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాయిప్రణీత్ 16–21, 19–21తో విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21–15, 21–8తో ఇషిక జైస్వాల్ (అమెరికా)–గురజాడ శ్రీవేద్య (భారత్) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment