ప్రపంచ ఏడో ర్యాంకర్‌పై విజయం
చాంగ్జౌ (చైనా): భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని నమోదు చేసింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సంచలన విజయంతో శుభారంభం చేసింది.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 43వ ర్యాంకర్ మాళవిక 26–24, 21–19తో ప్రపంచ ఏడో ర్యాంకర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై గెలిచింది.
46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మాళవిక తొలి గేమ్‌లో మూడు గేమ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్కాట్లాండ్ ప్లేయర్ క్రిస్టీ గిల్మోర్‌తో మాళవిక తలపడుతుంది. మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల మాళవిక ప్రస్తుతం థానే బ్యాడ్మింటన్ అకాడమీలో కోచ్ శ్రీకాంత్ వాడ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment