
కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు స్వర్ణ పతకం లక్ష్యంగా దూసుకుపోతున్నారు. మహిళల సింగల్స్‌లో సింధు, పురుషుల సింగల్స్‌లో శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వీరిద్దరు తమ తొలి రౌండ్లలో ప్రత్యర్ధులపై సునాయస విజయాలు సాధించి ముందడుగు వేశారు.
సింధు.. ఒలింపిక్ పతక విజేత, మాల్దీవులకు చెందిన ఫాతిమా నబా అబ్దుల్ రజాక్‌పై 21-4, 21-11 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా, శ్రీకాంత్.. ఉగాండాకు చెందిన డేనియల్ వానగాలియాపై 21-9, 21-9 తేడాతో సునాయాస విజయాన్ని సాధించాడు. గత కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు గెలిచిన సింధు, శ్రీకాంత్‌లు.. ఈ సారి ఎలాగైనా స్వర్ణం నెగ్గాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు.
చదవండి: భారత రిలే జట్టుకు రజతం
Comments
Please login to add a commentAdd a comment