
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి వాహనాన్ని తనిఖీ చేస్తున్న బృందం
సాక్షి, తొర్రూరు: మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. తొర్రూరు నుంచి కొడకండ్ల వైపు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కారును ఆపి తనిఖీ చేశారు. సిబ్బంది వాహనం వద్దకు చేరుకున్నాక మంత్రిని గుర్తించి వెనక్కి తగ్గే ప్రయత్నం చేశారు. అయితే.. వాహనాన్ని తనిఖీ చేయాలని మంత్రి సూచించడంతో పరిశీలించారు. మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతం గా జరగాలని.. అందుకు తాను సహకరిస్తానని మంత్రి తనిఖీ బృందంతో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment