లాలాపేట(హైదరాబాద్): టీఎస్‌పీఎస్సీ శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్షను బహిష్కరించినట్లు ఓయూ జేఏసీ నాయకులు రాజు నేత తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత మార్చి నెలలో నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 ప్రశ్నాపత్రం లీకేజీ కేసు విషయమై పోరాడితే అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు.
కానీ ఇప్పటి వరకు అసలైన నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందుకే గ్రూప్–4 పరీక్షకు వెళ్లకుండా బహిష్కరించామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 వేల ఉద్యోగాల భర్తీకి శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఈ పరీక్షలకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. టీఎస్‌పీఎస్సీ వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్–1 పరీక్షకు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలవారీగా ఓఎంఆర్ షీట్ల లెక్కింపు తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని తెలిపింది.
చదవండి: ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు
Comments
Please login to add a commentAdd a comment