Osmania students
-
గ్రూప్–4 పరీక్షను బహిష్కరించిన ఓయూ విద్యార్థి నేతలు
లాలాపేట(హైదరాబాద్): టీఎస్పీఎస్సీ శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్షను బహిష్కరించినట్లు ఓయూ జేఏసీ నాయకులు రాజు నేత తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత మార్చి నెలలో నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్–1 ప్రశ్నాపత్రం లీకేజీ కేసు విషయమై పోరాడితే అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అసలైన నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందుకే గ్రూప్–4 పరీక్షకు వెళ్లకుండా బహిష్కరించామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 వేల ఉద్యోగాల భర్తీకి శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఈ పరీక్షలకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. టీఎస్పీఎస్సీ వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్–1 పరీక్షకు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలవారీగా ఓఎంఆర్ షీట్ల లెక్కింపు తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని తెలిపింది. చదవండి: ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు -
ఈసారైనా కాంగ్రెస్ టికెట్ లభించేనా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ఉస్మానియా విద్యార్థి నేతల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్ల ఖరారు ప్రక్రియ కీలక దశకు చేరుకోవడం, రేపోమాపో పార్టీ అభ్యర్థుల జాబితా వస్తుందంటూ ప్రచారం జరుగుతుండటంతో ఈసారైనా తమకు పోటీ చేసే అవకాశం వస్తుందో లేదోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈసారి టికెట్లు ఆశిస్తున్న 10 మంది విద్యార్థి నేతల్లో ఇద్దరు లేదా ముగ్గురిని అధిష్టానం కరుణిస్తుందనే అంచనాతో ఆశావహులు తమ వంతు లాబీయింగ్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లోనూ భంగపాటే... తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక విశ్వవిద్యాలయాల నుంచి ముఖ్యంగా ఉస్మానియా నుంచి పదుల సంఖ్యలో విద్యార్థులు ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఇందులో ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్, గాదరి కిశోర్ లాంటి వారు టీఆర్ఎస్వీలో క్రియాశీలకంగా పనిచేసి కేసీఆర్‌కు అండగా నిలబడ్డారు. వారితోపాటు ఉద్యమంలో దీటుగా నిలిచిన మరికొందరు విద్యార్థి నేతలు ఎప్పటినుంచో కాంగ్రెస్‌కు అండగా నిలుస్తుండగా మరికొందరు 10 నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. వారిలో ఓయూలో ఎన్ఎస్యూఐలో కీలకంగా పనిచేస్తున్న మానవతారాయ్‌తోపాటు మేడిపల్లి సత్యం, రాజారాం యాదవ్, పున్నా కైలాశ్ నేత, దరువు ఎల్లన్న, చరణ్ కౌశిక్, క్రిశాంక్, దుర్గం భాస్కర్, బాల లక్ష్మి, కేతూరి వెంకటేశ్, చారగొండ వెంకటేశ్ తదితరులున్నారు. మానవతారాయ్, చరణ్, కైలాశ్, సత్యం, రాజారాంలు పార్టీ అధికార ప్రతినిధులుగా కూడా పనిచేస్తున్నారు. మిగిలిన వారూ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే వారిలో కొందరు గత ఎన్నికల సమయంలోనే టికెట్ ఆశించినా నిరాశే ఎదురైంది. క్రిశాంక్, ఎల్లన్నల పేర్లు కంటోన్మెంట్ స్థానం నుంచి చివరి వరకు ఉన్నా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతంకు కేటాయించారు. మిగిలిన వారికి అవకాశం రాలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ అధిష్టానం ఓయూ విద్యార్థి నేతల్లో ఒకరిద్దరికి కచ్చితంగా అవకాశం కల్పిం చే యోచనలో ఉందని, పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టుల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎవరెక్కడ..? ఉస్మానియా విద్యార్థి నేతలు ఆశిస్తున్న స్థానాల్లో సగం రిజర్వుడు నియోజకవర్గాలే ఉన్నాయి. మానవతారాయ్ (సత్తుపల్లి లేదా కంటోన్మెంట్), మేడిపల్లి సత్యం (చొప్పదండి), దరువు ఎల్లన్న (ధర్మపురి), దుర్గం భాస్కర్ (బెల్లంపల్లి), క్రిశాంక్ (కంటోన్మెంట్), చారగొండ వెంకటేశ్ (అచ్చంపేట)లు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలను ఆశిస్తున్నారు. మిగిలిన వారిలో రాజారాం యాదవ్ (ఆర్మూరు), పున్నా కైలాశ్ నేత (మునుగోడు), చరణ్ కౌశిక్ యాదవ్ (ఉప్పల్), బాలలక్ష్మి (జనగాం), కేతూరి వెంకటేశ్ (కొల్లాపూర్)లున్నారు. -
కాంగ్రెస్‌పై ఉస్మానియ విద్యార్ధి నేతల అసంతృప్తి
-
అరెస్టులతో సమస్య పరిష్కారం కాదు
నిరుద్యోగ సమస్యపై ప్రొఫెసర్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పాల్గొనకుండా చేసి ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకోవడం శోచనీయమని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. నిరుద్యోగ జేఏసీ చాలాకాలంగా ప్రభుత్వం ముందు, వర్సిటీ యాజమాన్యం ముందు పెడుతున్న ఉద్యోగ నియామకాల సమస్యను పరిష్కరించే బదులు విద్యార్థులను అరెస్టులు చేయడం సమంజసం కాదని అన్నారు. పోలీసులతో విద్యార్థులను అణచివేయొచ్చేమో కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనే అవకాశం మాత్రం ఉండదని స్పష్టం చేశారు. నిజానికి సెంటినరీ ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని తనకు సైతం ఉన్నప్పటికీ విద్యార్థుల అరెస్టులకు నిరసనగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవని, వలస పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలని కోదండరాం సూచించారు. -
కోదండరాంపై విమర్శలా?
ఓయూలో సీఎం, మంత్రుల దిష్టి బొమ్మలు దహనం హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాంను మంత్రులు విమర్శించడంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిరుద్యోగ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి సీఎంతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు దిష్టిబొమ్మలను ద హనం చేశారు. అనంతరం నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్, బీసీ ఉద్యమ వేదిక అధ్యక్షుడు దేశగాని సాంబశివగౌడ్, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ బాబులాల్ నాయక్ మాట్లాడుతూ కోదండరాంను విమర్శిస్తే సహించేది లేదన్నారు. కోదండరాం తెలంగాణ గాంధీ అని, ఆయన్ను విమర్శించే వారు అవివేకులని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) మండిపడింది. కోదండరాంను విమర్శించిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తెలంగాణలో తిరగన్విబోమని నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్‌కుమార్ హెచ్చరించారు. కోదండరాంకు రక్షణ కల్పించండి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు ఓయూ విద్యార్థి జేఏసీ లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాంకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ మంగళవారం లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి కోదండరాంకు ప్రాణహాని ఉందని లేఖలో పేర్కొన్నారు. కేబినెట్ మంత్రులు కోదండరాంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు. ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్న కోదండరాంను రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతోందన్నారు. -
కేసీఆర్‌పై భగ్గుమన్న ఓయూ విద్యార్థులు
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు భగ్గుమన్నారు. కేసీఆర్ మాటలకు నిరసనగా విద్యార్థులు ఉస్మానియా వర్సిటీలో ర్యాలీ నిర్వహించి, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎంసీసీ గేట్ వరకు నిరసన ర్యాలీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే ఇక కొత్తగా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని, తాము నిరుద్యోగులుగానే మిగిలిపోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.