
నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి, హీరో తిరువీర్ విడుదల చేసి, సినిమా మంచి హిట్టవ్వాలన్నారు. శ్రీమాన్ కీర్తి మాట్లాడుతూ– ‘‘పురాణాల్లోని జయ విజయలు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసుల్లా పుట్టారు.
వాళ్లు ఇప్పుడు కలియుగంలోకి వస్తే ఎలా ఉంటుంది? అనే కాల్పనిక కథతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రంలో మంచి భావోద్వేగాలున్నాయి’’ అన్నారు దాము రెడ్డి. ‘‘టీజర్ ఎంత బాగుందో సినిమా అంతకంటే బాగుంటుంది’’ అన్నారు నవీన్ బేతిగంటి.. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఉమేష్ చిక్కు, సహనిర్మాతలు: నవీన్ రెడ్డి, వసుంధరా దేవి.
Comments
Please login to add a commentAdd a comment