ఇప్పుడున్న హీరోల్లో వేగంగా సినిమాలు చేసేది ఎవరా అని చూస్తే చాలామందికి గుర్తొచ్చే పేరు నాని. ఓ మూవీ సెట్స్‌పై మరొకటి అనౌన్స్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు మాత్రం డబుల్ ధమాకా ఇచ్చేశాడు. గత కొన్నాళ్ల నుంచి ఏవైతే రూమర్స్ వస్తున్నాయో వాటిపై అధికారికంగా అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమాలు? ఏంటి సంగతి?
గతేడాది డిసెంబరులో 'హాయ్ నాన్న' అనే సెంటిమెంట్ మూవీతో హిట్ కొట్టిన హీరో నాని.. ప్రస్తుతం 'సరిపోదా శనివారం' చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 29న థియేటర్లలోకి ఇది రానుంది. దీని షూటింగ్ జోరుగా నడుస్తోంది. మరోవైపు నాని చేయబోయే కొత్త చిత్రాలపై కూడా ఇప్పుడు స్పష్టత వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?)
'బలగం' దర్శకుడు వేణు.. తన రెండో మూవీతో నానితో చేయబోతున్నాడని చాలారోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. తాజాగా నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలతో పాటు వేణు కూడా నానిని కలిసి విష్ చేయడంతో ఈ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తీసే ఈ సినిమా ప్రకటన త్వరలో వస్తుంది.
మరోవైపు 'ఓజీ' తీస్తున్న సుజీత్.. నానితో సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసి మరీ అధికారికంగా ప్రకటించేశారు. క్రూరమైన వ్యక్తి.. సౌమ్యుడిగా మారడంతో అతడి ప్రపంచం తలకిందులైపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో సినిమా చూసి తెలుసుకోవాలని హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాది రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. సో ఇలా తన పుట్టినరోజున రెండు సినిమాల అప్డేట్స్ నాని నుంచి వచ్చేశాయ్.
(ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment