విజయలక్ష్మి, సీమాన్
సాక్షి, చైన్నె : నటి విజయలక్ష్మీ మళ్లీ తెర మీదకు వచ్చా రు. నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్‌ను అరెస్టు చేయాలని కోరుతూ తాజాగా ఆమె చైన్నె పోలీసు కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సినీ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తనను మోసం చేసినట్టుగా 2011 నుంచి నటి విజయలక్ష్మి పోరాటం చేస్తూ వస్తున్నారు. న్యాయం కోసం ఆమె కొన్ని సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశారు. అలాగే తరచూ సీమాన్‌కు వ్యతిరేకంగా ఆమె తీవ్రంగా విరుచుకు పడుతూ వస్తున్నా రు. అయితే ఇప్పటి వరకు సీమాన్‌పై అనేక ఫిర్యాదు లు వచ్చినా ఫలితం మాత్రం శూన్యం.
దీంతో మళ్లీ తెర మీదకు వచ్చిన విజయలక్ష్మి చైన్నె పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీమాన్ తనను మోసం చేశాడని, ఆయన్ని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. 2011 నుంచి తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే వచ్చానని, అన్నాడీఎంకే హ యాంలో సీమాన్‌కు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. ప్రస్తుతం మహిళా సంక్షేమం కోసం శ్రమిస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో అధికా రంలో ఉందని, అందుకే తనకు న్యాయం దొరుకుతుందన్న ఆశతో మళ్లీ ఫిర్యాదుచేశానన్నారు.
గతంలో తాను ఫిర్యాదు చేస్తే, సీమాన్‌ను విచారించ లేదని, అయితే తననే విచారించారని, బెదిరించారని ఆరోపించారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను కమిషనర్‌కు సమర్పించానని, సీమాన్‌ను అరెస్టు చేసి తనకు న్యా యం చేయాలని విన్నవించుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు జరగబోయే విచారణ తన జీవితానికి చావో రేవో లాంటిదని, తనకు న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు ఆమె ఆగ్రహానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment