భాస్కరభట్లకు మాతృవియోగం | Tollywood lyricist Bhaskarabhatla Ravi Kumar Mother dies | Sakshi
Sakshi News home page

భాస్కరభట్లకు మాతృవియోగం

Published Wed, Jul 10 2019 8:33 AM | Last Updated on Wed, Jul 10 2019 8:39 AM

Tollywood lyricist Bhaskarabhatla Ravi Kumar Mother dies - Sakshi

రాజమహేంద్రవరం ‌: ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్‌ తల్లి విజయలక్ష్మి (67) తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్ను మూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భాస్కరభట్ల పెద్ద కుమారుడు. విజయలక్ష్మి అంత్యక్రియలు స్థానిక ఇన్నీసుపేట కైలాసభూమిలో మంగళవారం జరిగాయి. ఆమె చితికి భాస్కరభట్ల నిప్పంటించారు. పలువురు సినీ ప్రముఖులు, సాహితీకారులు భాస్కరభట్లకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement