శామీర్‌పేట్: ఇటీవల కురిసిన వర్షాలతో పైర్ల ఎదుగుదల కోసం రైతులు రసాయన ఎరువులు చల్లుతున్నారు. వీటిలో నకిలీ ఎరువులను ఎలా గుర్తించాలి. ఎరువుల కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై రైతులకు శామీర్‌పేట్ మండల వ్యవసాయ అధికారి విజయలక్ష్మి కొన్ని సూచనలు, సలహాలు అందజేశారు.
సాధారణంగా మార్కెట్‌లో దొరికే 14:28:14, 15:15:15, 17:17:17, 19:19:19, 24:24:0 28:28:0 తదితర ఎరువుల్లో కల్తీని గుర్తించేందుంకు ఒక చెంచా ఎరువును 5 మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిలో వేసి బాగా కలిపితే అడుగున మడ్డి చేరితే కల్తీ జరిగిందని గుర్తించవచ్చు.
కాంప్లెక్స్ ఎరువుల తయారీదారులు ఎరువుల మూల పదార్థాలను తగ్గించేందుకు ఇసుక రేణువులను కలుపుతారు. ఎరువుల పరీక్ష సమయంలో ఇసుక రేణువులు పాత్ర అడుగు భాగానిక చేరితే కల్తీ ఎరువుగా గుర్తించాలి.
{పభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లో ఎరువులు కొనుగోలు చేయాలి. బిల్లును తీసుకుని భద్రపర్చాలి.
ఎరువుల్లో ఇతర పదార్థాలు కనిపిస్తే దానిని కల్తీ ఎరువుగా గుర్తించాలి.
5 మిల్లీ లీటర్ల పరిశుభ్రమైన నీటిలో ఒక చెంచా ఎరువును వేసి బాగా కదిపి తరువాత స్వచ్ఛమైన ద్రావణంగా తయారయితే అది నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరియా, అమోనియం క్లోరైడ్ ఎరువులకు 10 మిల్లీలీటర్ల నీటిని వినియోగించాలి.
డీలర్ బుక్‌లో రైతు తప్పనిసరిగా సంతకం చేయాలి. మిషిన్ కుట్టు ఉన్న బస్తాను మాత్రమే తీసుకోవాలి.
చేతి కుట్టు ఉన్నట్లయితే దానిపై సీసంతో సీలు ఉందో లేదో చూడాలి.
బస్తాపై ప్రామాణిక పోషకాలు, ఉత్పత్తిదారుడి వివరాలను చూడాలి.
ఎరువుల బస్తాను తూకం వేసిన అనంతరం తీసుకోవాలి. చిరిగిన కుట్లు వేసిన బస్తాలను తీసుకోవద్దు.
అందమైన ప్యాకింగ్‌కు ఆకర్షితులు కాకుండా వ్యవసాయాధికారుల సిఫారస్ చేసిన మందులనే కొనుగోలు చేయాలి.
నకిలీ ఎరువులను గుర్తించండిలా..
Published Mon, Sep 8 2014 12:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement