
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఈ రోజు రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాన్సూన్ యాక్షన్ టీమ్‌లను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, కూకట్‌పల్లి, పంజాగుట్ట, సికింద్రాబాద్, మెహదీపట్నం, బంజారాహిల్స్, అబ్దుల్లాపూర్మెట్, సరూర్ నగర్, కర్మన్ ఘాట్, మీర్‌పెట్, లాల్ ధర్వాజా, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడా, గౌలిపురా, అలియబాద్, ఛత్రినాక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.
చదవండి: (కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్ రాబోతోంది: రేవంత్‌రెడ్డి)