నరసన్న రథోత్సవం | narasanna festival | Sakshi
Sakshi News home page

నరసన్న రథోత్సవం

Published Thu, Mar 9 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

నరసన్న రథోత్సవం

నరసన్న రథోత్సవం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో బుధవారం కన్నులపండువలా జరిగింది. కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామి వారిని పెండ్లికుమారుడిగా, అమ్మవారిని పెండ్లికుమార్తెగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు.ఆలయ ఆనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు జగన్నాథం, టి.తులారామ్, ఎంకేటీఎ¯ŒSవీ ప్రసాద్, పీవీ రమణ, టీఎ¯ŒS రాంజీ, శ్రీ నృసింహభట్టర్‌ స్వామి, ఆలయ వంశపారంపర్య అర్చకులు, డీఎస్పీ ఏవీఎల్‌ ప్రసన్నకుమార్‌ ముందు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. సుందరంగా తీర్చిదిది్దన రథంపై వేంచేసిన స్వామి వారిపై అరటిపండ్లు విసిరి భక్తిని చాటుకున్నారు. రథం ముందు వివిధ దేవతావేషధారణలు,  కోలాటాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి.  జై లక్ష్మీనరసింహ స్వామి, జై గోవిందా గోవిందా అన్న భక్తుల నినాదాలతో కోరుకొండ వీధులు మార్మోగాయి.
– కోరుకొండ (రాజానగరం)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement