సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పోలవరం నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు సీఎం అండగా నిలిచారన్నారు. వారికి నివాసం ఏర్పాటు చేయడంతో పాటు, ఆయనే స్వయంగా గృహ ప్రవేశం చేయించడంతో నిర్వాసితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత ప్రభుత్వం పట్టించుకోకున్నా వైఎస్ జగన్ అండగా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు. కాలనీలో మరికొన్ని సౌకర్యాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్ స్వయంగా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని.. నమ్మలేకపోయామని నిర్వాసితులు అన్నారు. సీఎం జగన్ వస్తే నా పెద్దకొడుకే వచ్చినట్లు ఉందని వృద్ధురాలు అన్నారు. ఎన్నో కష్టాలు పడ్డామని.. సీఎం జగన్ అండగా నిలిచారన్నారు.
చదవండి: మాట నిలబెట్టుకుంటాం: సీఎం వైఎస్ జగన్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పునరావాస కాలనీలను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సందర్శించి, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఇందుకూరు-1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులను కలుసుకున్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. అనంతరం పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించి, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment