రత్నగిరిపై వాహనాలకు ‘వన్ వే’
Published Mon, Oct 31 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
అన్నవరం :
కార్తీక మాసంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో వాహనాల రాకపోకలకు వన్‌వే ఏర్పాటు చేశారు. రత్నగిరికి చేరుకునేందుకు, కొండ దిగువకు వచ్చేందుకు వేర్వేరుగా రెండు ఘాట్‌రోడ్‌లు ఉన్నాయి. తాజాగా రత్నగిరిపై కూడా వన్‌వే అమలు చేస్తున్నట్టు దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు సోమవారం విలేకరులకు తెలిపారు. ఆలయానికి వెళ్లే వాహనాలను ప్రకాష్ సదన్ సత్రం వెనుక రోడ్డు ద్వారా సీఆర్‌ఓ కార్యాలయం వద్దకు మళ్లిస్తారు. కాగా స్వామివారి ప్రత్యేక దర్శనం (రూ.100) టిక్కెట్లను మంగళవారం నుంచి ఆన్‌లైన్‌కు అనుసంధానం చేస్తున్నారు. భక్తులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఇచ్చేందుకు తూర్పు రాజగోపురం, పశ్చిమ రాజగోపురం , ప్రధానాలయం వద్ద మూడు కౌంటర్లలో ఈ సదుపాయం మంగళవారం నుంచి వినియోగంలోకి వస్తుంది. ఎంతమంది భక్తులు ప్రత్యేకదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేశారో ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది.
Advertisement
Advertisement