- రూ.99.47 లక్షల రాబడిలో వాటి విలువ రూ.40 లక్షలు
- రూ.20 లక్షలతో రెండో స్థానంలో పది నోట్లు
- పాత 500, వేయి నోట్లు రూ.8.66 లక్షలు
సత్తెన్న హుండీలో వంద నోట్ల వర్షం
Published Fri, Dec 30 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM
అన్నవరం :
పెద్దనోట్ల రద్దు తరువాత సత్యదేవుని హుండీలలో వందనోట్లు విరివిగా పడ్డాయి. రూ.రెండు వేలు, రూ.500 కొత్త నోట్లు విడుదలైనా ప్రస్తుతం మార్కెట్‌లో అత్యధికంగా వంద నోట్లే చలామణిలో ఉండడంతో భక్తులు కూడా సత్యదేవుని హుండీలో వాటినే ఎక్కువగా వేశారు. గురువారం సత్యదేవుని హుండీ ఆదాయాన్ని లెక్కించగా గత 30 రోజులకు రూ.99,47,042 ఆదాయం వచ్చింది. అం దులో రూ.వంద నోట్లు 40,263 ఉన్నాయి. కాగా పది రూపాయల నోట్లు 1,99,912 వచ్చాయి. హుండీ ల ద్వారా బంగారం 79 గ్రాములు, వెండి 535 గ్రాములు సమకూరాయి.
14 దేశాల కరెన్సీ నోట్లు
ఇండియా కరెన్సీతో కలిపి మొత్తం 14 దేశాల కరెన్సీ హుండీల ద్వారా లభించింది. యూఎస్‌ఏ డాలర్లు 436, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు పది, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 102, సింగపూర్ డాలర్లు 116 , మలేషియా రిమ్స్ 73, ఆస్ట్రేలియా డాలర్లు 105, నేపాల్ రూపాయలు పది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమె¯ŒS రియల్స్ 2.5, యూరో కరెన్సీ 20, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ దీనార్–1, న్యూజిలాండ్ సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ 20, సౌతాఫ్రికా కరెన్సీ 50 రాండ్స్ , వెనిజులా కరెన్సీ 100 సీబీలు లభించాయి. 2016లో చివరిసారిగా గురువారం లెక్కించిన సత్యదేవుని హుండీల ద్వారా దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. సాధారణంగా మార్గశిర, పుష్య మాసాలలో భక్తుల రాక తక్కువగా ఉండి హుండీ ఆదాయం కూడా పెద్దగా ఉండదు. అయితే ఈ సారి వరుస సెలవులు, వివాహాల వంటి వాటి వలన హుండీ ఆదాయం గణనీయంగానే వచ్చిందని దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. రద్దయిన రూ.500, రూ.వేయి నోట్ల మార్పిడి ఈ నెల 30 తో ముగుస్తున్నందున ఇకపై వచ్చే పాత నోట్లను ఆర్‌బీఐకే పంపిస్తామని ఈఓ తెలిపారు.
తలుపులమ్మ వారికి రూ.14.46 లక్షల రాబడి
తుని రూరల్ : తలుపులమ్మ వారి దేవస్థానం ఆవరణలో హుండీల్లో నగదును గురువారం లెక్కించడంతో రూ.14,46,831 ఆదాయం లభించిందని అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. పెద్దనోట్లు రద్దవడం, 30తో మార్చుకునేందుకు గడువు ముగుస్తుండడంతో హుండీలను తెరిచినట్టు తెలిపారు. తుని పట్టణం మెయి¯ŒS రోడ్డులో తలుపులమ్మ వారి గుడి హుండీలో నగదు లెక్కించగా రూ.33,360 లభించాయన్నారు. చైర్మ¯ŒS కరపా అప్పారావు, ధర్మకర్తలు యాదాల లోవకృష్ణ, యాదాల సింహాచలం, అత్తి అచ్చుతరావు, బి.అప్పలనాయుడు, ఎ¯ŒS.సి.హెచ్.నారాయణాచార్యులు, పుల్లంరాజు, తర్రా బుల్లెబ్బాయి, సూపరింటెండెంట్లు కె.వి.రమణ, ఎల్.వి.రమణ, ఆలయ ఇ¯ŒSస్పెక్టర్లు గుబ్బల రామకృష్ణ, నాయుడు తదితరులు లెక్కింపులో పాల్గొన్నారు.
Advertisement